Rajamouli
Mahesh Rajamouli Movie : రాజమౌళి సినిమాకు కర్త కర్మ క్రియ ఆయనే. అన్ని విభాగాల్లో ఆయన ప్రమేయం ఉంటుంది. నిర్మాతతో పాటు హీరో కూడా చెప్పినట్లు వినాల్సిందే. రాజమౌళి తన ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతి విషయంలో కేర్ఫుల్ గా ఉంటారు. ముఖ్యంగా కీలక విషయాలు లీక్ కాకుండా చూసుకుంటాడు. అవుట్ డోర్ నుండి కానీ సెట్స్ నుండి కానీ ఎలాంటి సమాచారం బయటకు రాకూడదు అనుకుంటాడు. రాజమౌళి సెట్స్ లోకి మొబైల్స్ అనుమతించడు. ఎవరైనా సెల్ ఫోన్ బయట ఇచ్చేసి సెట్ లో అడుగుపెట్టాలి.
ఇక తన హీరోలకు కూడా సవాలక్ష కండిషన్స్ పెడతాడు. తాను కోరుకున్న లుక్ కోసం షూటింగ్ కి ముందు నుండే నటులు, హీరోలు కష్టపడాలి. బాహుబలి కోసం రానా, ప్రభాస్… ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎన్టీఆర్, చరణ్ ఇలానే కసరత్తులు చేశారు. యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అలాగే రాజమౌళి సినిమా పూర్తి అయ్యే వరకు మరొక సినిమా చేయడానికి వీల్లేదు.కాగా రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో ప్రకటించిన విషయం తెలిసిందే. మహేష్ కి కూడా రాజమౌళి కొన్ని సూచనలు చేశాడట.
మార్చి తర్వాత మహేష్ బయట కనిపించడానికి వీలు లేదట. అలాగే యాడ్ షూట్స్ చేయకూడదట. టూర్స్ కి వెళ్ళకూడదట. రాజమౌళి సినిమా పూర్తి అయ్యేవరకు మహేష్ ఈ కండిషన్స్ పాటించాలట. మహేష్ లుక్ ఏ విధంగా బయటకు తెలియకూడదనే ఉద్దేశంతో రాజమౌళి ఈ సూచనలు చేశాడట. మహేష్ ని సరికొత్తగా చూపించాలని ఫిక్స్ అయిన రాజమౌళి లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
కేవలం లుక్ టెస్ట్ కి నెల రోజుల సమయం పడుతుందట. ఇప్పటికే మహేష్ లుక్ పై కొన్ని స్కెచ్ లు ప్రిపేర్ చేశాడట. వాటిలో రాజమౌళి సెలెక్ట్ చేసిన లుక్ లోకి మహేష్ బాబు మారాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి కనీసం మూడేళ్ల పడుతుంది. అప్పటి వరకు మహేష్ బాబు తన సరదాలు చంపుకోవాల్సిందే. ముఖ్యంగా ఫ్యామిలీతో విదేశీ ట్రిప్స్ ఆయన మిస్ అవుతారు. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 1000 కోట్లు అని సమాచారం.