https://oktelugu.com/

Puri Jagannath : ఛార్మి ని వదిలించుకున్న పూరి..చాలా కాలం తర్వాత కుటుంబం వద్దకు!

పూరి జగన్నాథ్ మెల్లిగా చార్మీ నుండి బయటకి వస్తున్నట్టు తెలుస్తుంది.రీసెంట్ గా ఆయన తన కుటుంబం మొత్తంతో కలిసి ఒక ఫోటో దిగాడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 12, 2023 / 10:35 PM IST
    Follow us on

    Puri Jagannath : టాలీవుడ్ లో మాస్ హీరోయిజం అనే పదానికి సరికొత్త నిర్వచనం తెలిపిన దర్శకులలో ఒకడు పూరీ జగన్నాథ్. బద్రి సినిమా తో ప్రారంభమైన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ లో ఒక సంచలనం. ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ కి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా పూరి జగన్నాథ్ మార్కెట్ చెక్కు చూడరదు.టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో పూరి జగన్నాథ్ కి మంచి రిలేషన్ కూడా ఉంది.

    డైరెక్టర్ గా ఆయన సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఒక భర్త గా , ఒక తండ్రి గా పూరి జగన్నాథ్ కుటుంబానికి న్యాయం చెయ్యడం లేదని, ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్. ప్రముఖ నటుడు / నిర్మాత బండ్ల గణేష్ కూడా పూరి జగన్నాథ్ కొడుకు నటించిన ‘చోర్ బజార్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కుటుంబాన్ని పట్టించుకో అన్నా అంటూ పూరి జగన్నాథ్ పరువు తీసేసాడు.

    ప్రముఖ హీరోయిన్ చార్మీ ఎప్పుడైతే పూరి జగన్నాథ్ జీవితం లోకి వచ్చిందో, అప్పటి నుండి పూరి జగన్నాథ్ భార్య ‘శ్రావణి’ కి పూరికి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిందట. గడిచిన రెండు సంవత్సరాలలో అయితే పూరి జగన్నాథ్ కుటుంబం మొత్తానికి దూరం గా వెళ్ళిపోయినట్టు వార్తలు వచ్చాయి, అంతే కాదు ఆయన తన భార్య కి విడాకులు కూడా ఇవ్వబోతున్నాడు అంటూ మీడియా లో వచ్చాయి.

    అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ మెల్లిగా చార్మీ నుండి బయటకి వస్తున్నట్టు తెలుస్తుంది.రీసెంట్ గా ఆయన తన కుటుంబం మొత్తంతో కలిసి ఒక ఫోటో దిగాడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇలా కుటుంబం తో కలిపి నిన్ను చూసి ఎంత కాలం అయ్యింది అన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఇదే విధంగా ఇక నుండి కూడా ఆయన ఉంటాడో లేదో చూడాలి.