https://oktelugu.com/

Custody Collections : ‘కస్టడీ’ మొదటి రోజు వసూళ్లు..’శాకుంతలం’ వసూళ్లను కూడా దాటలేదా!

కస్టడీ చిత్రానికి మార్కెట్ లో పెద్ద హైప్ లేకపోవడం తో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రం గానే జరిగాయట. ఇక డివైడ్ టాక్ రావడం తో మ్యాట్నీస్ కి మార్నింగ్ షోస్ తో పోలిస్తే 50 శాతం కి పైగా డ్రాప్స్ పడ్డాయట.

Written By:
  • NARESH
  • , Updated On : May 12, 2023 / 10:12 PM IST

    Custody Collections:

    Follow us on

    Custody Collections :  టాలీవుడ్ కి ఈ ఏడాది సమ్మర్ అసలు ఏమాత్రం అచ్చిరాలేదు.ఇంకా చెప్పాలంటే ఇంత చెత్త సమ్మర్ టాలీవుడ్ కి గడిచిన పదేళ్లలో ఎప్పుడూ లేదనొచ్చు. ఈ సమ్మర్ కానుకగా విడుదలైన సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మరియు న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రాలు మినహా, మిగిలిన సినిమాలన్నీ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి.దానికి తోడు టాలీవుడ్ టాప్ 6 హీరోల నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం, ట్రేడ్ డీలాపడిపోవడానికి కారణం అయ్యింది.

    ఇదంతా పక్కన పెడితే అక్కినేని కుటుంబం ఈ సమ్మర్ లో టాలీవుడ్ కి మామూలు రేంజ్ నష్టాలను తీసుకొని రాలేదు.అక్కినేని నాగ చైతన్య మాజీ భార్య సమంత నటించిన ‘శాకుంతలం’, అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ ఇక ఈరోజు విడుదలైన నాగ చైతన్య ‘కస్టడీ’ చిత్రాలు ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి.ఇక నేడు విడుదలైన ‘కస్టడీ’ మొదటి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము.

    ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, కస్టడీ చిత్రానికి మార్కెట్ లో పెద్ద హైప్ లేకపోవడం తో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రం గానే జరిగాయట. ఇక డివైడ్ టాక్ రావడం తో మ్యాట్నీస్ కి మార్నింగ్ షోస్ తో పోలిస్తే 50 శాతం కి పైగా డ్రాప్స్ పడ్డాయట. అలాగే ఫస్ట్ షోస్ కి మ్యాట్నీస్ తో పోలిస్తే 70 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. అలా రోజు మొత్తానికి ఈ చిత్రం కనీసం కోటి 50 లక్షల రూపాయిల షేర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించింది. నాగ చైతన్య కస్టడీ చిత్రం అంతకంటే తక్కువ వసూళ్లు రాబట్టడం శోచనీయం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత రాబట్టబోతుందో చూడాలి.