Prabhas: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా 2027 మార్చి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో చాలా వైలెంట్ గా కనిపించబోతున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తూనే ఆయనలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ను ఈ సినిమాలో వాడుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరో ఎలివేషన్స్ తో పాటు హీరోకి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సినిమాలో సైతం ప్రభాస్ ని ఆ రేంజ్ లోనే చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇందులో ప్రభాస్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫస్టాఫ్ మొత్తం తను ఒక ఫ్యామిలీ వాతావరణం లో పెరిగే అబ్బాయి గా కనిపించబోతున్నాడట.
సెకండాఫ్ లో ఒక ఫుల్ ఎంత పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… తన క్యారెక్టర్ ఆర్కు ను కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో ప్రభాస్ క్యారెక్టర్ డిజైన్ చేశారట.
మొత్తానికైతే ఈ సినిమాతో సందీప్ రెడ్డివంగా 2000 కోట్లకు పైన కలెక్షన్ ను కొల్లగొడతాననే నమ్మకంతో ఉన్నాడు. ప్రభాస్ అభిమానులు సైతం సందీప్ ని బ్లైండ్ గా నమ్ముతున్నారు. ఆయన ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రభాస్ కి ఇండస్ట్రీ హిట్ ని అందిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం ప్రభాస్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరు.
ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన నుంచి వచ్చిన ఫ్లాప్ సినిమా సైతం వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ ను వాడుకొని సందీప్ ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
