Prabhas : సలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఆ సినిమాను ఎంజాయ్ చేస్తూ తనదైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కొత్త సంవత్సరం తన ఇన్ స్టా లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని పెట్టాడు అది ఏంటి అంటే “ఖాన్సార్ భవిష్యత్తును నేను రాస్తాను మీరంతా నా వెనుక కూర్చోండి” అంటూ రాస్తూనే అందరికీ న్యూయర్ శుభాకాంక్షలు అంటూ ప్రభాస్ ఒక ఫోటోని పోస్ట్ చేశాడు.ఇక ప్రస్తుతం ఇప్పుడు అది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక అందరికీ ఇపుడు వస్తున్న కొత్త డౌట్లు ఏంటి అంటే సలార్ 2 సినిమా స్టార్ట్ చేస్తున్నారా అనే డౌట్లు అయితే అందరికీ వస్తున్నాయి.ప్రభాస్ ఇలాంటి మ్యాటర్ రాయడం పట్ల సెకండ్ పార్ట్ ని కూడా తొందరగానే షూట్ చేసే పని లో పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభాస్ అటు మారుతి సినిమా ఇటు నాగ్ అశ్విన్ తో కల్కి సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఇక ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన వెంటనే మళ్ళీ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయాల్సి ఉంది.
కాబట్టి సలార్ 2 ఇప్పుడైతే వచ్చే అవకాశం అయితే లేదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ప్రభాస్ ఇలాంటి ఒక పోస్ట్ పెట్టడంతో తన అభిమానులకి ఒక పెద్ద న్యూ ఇయర్ వేడుక లాగా మారింది. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో ఇలా పోస్ట్ పెట్టడంతో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ప్రతి అభిమాని కూడా ప్రభాస్ గురించి చర్చలు జరుపుకుంటున్నారు. అయితే ప్రభాస్ కు సంబంధించిన నెక్స్ట్ సినిమా మళ్లీ ఎప్పుడు వస్తుంది అంటూ నార్త్ లో ఉన్న ప్రభాస్ అభిమానులు మాత్రం విపరీతంగా ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తుంది.
సలార్ సినిమాలో ప్రభాస్ ని చూసినవాళ్లు ప్రభాస్ సినిమాల కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక వీలైనంత తొందరగా ప్రభాస్ ఈ సంవత్సరంలో రెండు సినిమాలను తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అందులో భాగంగానే కల్కి సినిమా ఈ సంవత్సరం రిలీజ్ చేస్తుండగా మారుతి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. 2023 వ సంవత్సరంలో ప్రభాస్ ఆది పురుషు,సలార్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించి వాళ్ళని ఆనందానికి గురి చేశాడు…