Darling Re Release Collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన లవ్ స్టోరీ ‘డార్లింగ్'(#Darling4K) చిత్రాన్ని రీసెంట్ గానే 4K కి అప్ గ్రేడ్ చేసి , డాళ్బీ అట్మాస్ సౌండ్ తో ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కొన్ని కొత్త సినిమాలను కూడా ఈ రేంజ్ భారీగా విడుదల చేయలేదు. అంతటి భారీ హంగులతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయే రేంజ్ లోనే వచ్చింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్తానికి 5 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈమధ్య కాలం లో విడుదలైన కొన్ని మీడియం రేంజ్ కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు. బోసిపోయిన సమ్మర్ సీజన్ కి కొత్త ఊపిరి పోసేలా చేసింది ఈ చిత్రం.
కేవలం మొదటి రోజు మాత్రమే కాదు , రెండవ రోజు కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి రెండవ రోజున దాదాపుగా 24 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు , ఇప్పటి వరకు ఏ రీ రిలీజ్ చిత్రానికి కూడా ఈ రేంజ్ లో టికెట్స్ రెండవ రోజున అమ్ముడుపోలేదు. ఇక మూడవ రోజున అయితే గంటకు వెయ్యికి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి అరుదైన ఘటన కూడా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. చూస్తుంటే ఫుల్ రన్ లో కచ్చితంగా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కచ్చితంగా రాబట్టేలాగానే అనిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే రెండవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 93 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా , ప్రపంచవ్యాప్తంగా 1 కోటి 12 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.
ప్రాంతాల వారీగా మొదటి రెండు రోజులు ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి దాదాపుగా 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 36 లక్షలు , ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 1 కోటి 86 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి రెండు రోజులకు కలిపి 5 కోట్ల 25 లక్షల రూపాయిల రోస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఓవర్సీస్ నుండి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి . ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.