Homeక్రీడలుక్రికెట్‌KL Rahul: కేఎల్ రాహుల్ ఊర మాస్ బ్యాటింగ్.. లక్నో ఓనర్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

KL Rahul: కేఎల్ రాహుల్ ఊర మాస్ బ్యాటింగ్.. లక్నో ఓనర్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

KL Rahul: ఈ ఐపీఎల్లో పెద్దపెద్ద తోపు బ్యాటర్లు కూడా ఊహించలేని ఇన్నింగ్స్ అది. యంగ్ క్రికెటర్లు కూడా కలలో ఊహించలేని బ్యాటింగ్ అది. పైగా పంజాబ్ బౌలర్ల మీద.. ఏ మాత్రం కనికరం లేదు. ఏ మాత్రం భయం లేదు. తను ఆడుతోంది పంజాబ్ జట్టు మీద అనే బెదురు లేదు. దూకుడుగా కాకుండా అంతకుమించిన స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. 67 బంతులు ఎదుర్కొని 152* పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలి వికెట్ కు 28 పరుగులు మాత్రమే భాగస్వామ్యంగా నెలకొల్పిన రాహుల్.. రెండో వికెట్ కు ఏకంగా 220 పరుగులను భాగస్వామ్యంగా నిర్మించాడు. నితీష్ రానా (91) 9 పరుగుల దూరంలో సెంచరీ కోల్పోయాడు. ఒకవేళ అతడు కూడా సెంచరీ చేసి ఉంటే.. ఢిల్లీ జట్టు ఇంకా అద్భుతమైన రికార్డులను నెలకొల్పేది.

కేఎల్ రాహుల్ వల్ల ఢిల్లీ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. ఓవర్ కు 13 కు మించి రన్ రేట్ తో 264 పరుగులు చేసింది. ఐపీఎల్ లో హైయెస్ట్ పరుగులు చేసిన జట్టుగా ఢిల్లీ అవతరించింది.152* పరుగులు చేసి హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ ఆవిర్భవించాడు. కేఎల్ రాహుల్ వీరోచిత బ్యాటింగ్ తో ఢిల్లీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక ను ఆడేసుకుంటున్నారు. పాత సినిమాల వీడియోలను ప్రముఖంగా ప్రస్తావించి.. సంజీవ్ ను వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.

2024లో లక్నో జట్టు సారధిగా కేఎల్ రాహుల్ ఉన్నాడు. నాడు హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో దారణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మైదానంలోనే కేఎల్ రాహుల్ తో సంజీవ్ గొడవపడ్డాడు. కేఎల్ రాహుల్ తీరు పట్ల సంజీవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంజీవ్ అలా మాట్లాడటంతో రాహుల్ నొచ్చుకున్నాడు. దీంతో అతడు 2025 సీజన్ లో లక్నో జట్టు నుంచి బయటికి వచ్చేసాడు. గత సీజన్ నుంచి ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో అతడు కీలక ఆటగాడిగా ఉన్నాడు.

పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 152 పరుగులు చేసి రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తద్వారా కేఎల్ రాహుల్ పరోక్షంగా సంజీవ్ కు గట్టి గుణపాఠం చెప్పాడు. కె.ఎల్ రాహుల్ ను వదులుకొని రిషబ్ పంత్ ను భారీ ధరకు కొనుగోలు చేశాడు సంజీవ్. కానీ ఇంతవరకు పంత్ లక్నో జట్టుకు చెప్పుకోదగ్గ స్థాయి విజయాలు అందించలేకపోయాడు. అంతేకాదు.. ఆటగాడిగా కూడా అంతగా అదిరిపోయే స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అందువల్లే కేఎల్ రాహుల్ ను ఢిల్లీ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వజ్రపు వేటలో పడి బంగారాన్ని కోల్పోయాడని సంజీవ్ ను ఉద్దేశించి ఢిల్లీ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యనిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version