Dhurandhar 2 Box Office Collections: ‘ ఉగాది / రంజాన్ కానుకగా ఏప్రిల్ 19 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైన ‘ధురంధర్ 2 : ది రివెంజ్'(Dhurandhar 2: The Revenge) బాక్స్ ఆఫీస్ సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి 11 రోజులు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు. ఊపు చూస్తుంటే 2500 కోట్ల మార్కుని ఈ చిత్రం కచ్చితంగా అందుకుంటుందని అంతా అనుకున్నారు కానీ , 12 వ రోజు నుండి ఊపు బాగా తగ్గిపోయింది. కానీ కలెక్షన్స్ మాత్రం చాలా స్టడీ గా ఉన్నాయి. ఈ చిత్రం విడుదలై 37 రోజులు పూర్తి అయ్యింది. ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ అనేది. ఇక నేడు బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 3 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
ఇదంతా పక్కన పెడితే , ఇప్పుడు ట్రేడ్ లో సాగుతున్న చర్చ ఏమిటంటే , ఈ సినిమా ‘బాహుబలి 2’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని అందుకుంటుందా లేదా అని. ‘బాహుబలి 2’ చిత్రం మొదటి విడత రిలీజ్ లో అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 1810 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి ‘ధురంధర్ 2’ చిత్రం ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి చూద్దాం. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1798 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియా వైడ్ గా వారాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , మొదటి వారం లో 690 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, 2 వ వారంలో 271 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా ౩వ వారం లో ఈ చిత్రానికి 120 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, 4 వ వారం నుండి 58 కోట్లు, 5 వ వారం నుండి 22 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక 37 వ రోజున అయితే ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 2 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 1163 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, 1373 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఏకంగా 425 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 1798 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు, రేపు వచ్చే కలెక్షన్స్ ని కలిపితే కచ్చితంగా ఈ చిత్రం ‘బాహుబలి 2 ని దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.