Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి… కానీ అంచనాలను ఈ సినిమా అందుకోలేక పోయిందనేది వాస్తవం… సినిమా రిలీజ్ అయి పదిహేను 17 రోజులు అయిపోతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా అయితే 1000 కోట్ల మార్క్ ను దాటలేదు. దాంతోనే ఈ సినిమా కొంతవరకు డీలా పడిపోయిందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. 350 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత కలెక్షన్స్ ని రాబడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికైతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. రీసెంట్ గా కొన్ని సన్నివేశాలను కలిపినప్పటికి ఈ సినిమాని చూడడానికి ఎవ్వరు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు… నిజానికి ఈ సినిమా తేడా కొట్టడానికి అసలు కారణం ఎవరు? తప్పంతా ఎక్కడ జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మేకర్స్ అయితే ఉన్నారు.
నిజానికి దర్శకుడు బుచ్చిబాబు ఈ కథను అనుకున్నప్పుడే దీనిని ఇంకా ఎమోషనల్ గా మార్చాల్సి ఉంది. అలాగే స్టార్ హీరోని పెట్టుకొని అతనికి ఒక కాలు తీసేయడం అనేది కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులైతే దాన్ని ఓన్ చేసుకోలేకపోయారు. దానివల్ల క్యారెక్టర్ అనేది తేలిపోయింది.
అందుచేత స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్ ఏం చేసిన కూడా ప్రేక్షకుడు దానికి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాడు. మొత్తానికైతే రామ్ చరణ్ లాంటి నటుడు ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడి తను అనుకున్నది అనుకున్నట్టుగా పోట్రే చేయగలిగాడు. అయినప్పటికి అది అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు… మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి వసూళ్లను రాబడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
