Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. గత 26 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. అలాంటి రాజమౌళి ఒక విషయంలో చిరంజీవికి హెల్ప్ చేశారట. ఇక విషయాన్ని చిరంజీవి ఇప్పటికి గుర్తు పెట్టుకొని రాజమౌళి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారట. ఆ హెల్ప్ ఏంటి అంటే రామ్ చరణ్ సెకండ్ సినిమా అయిన ‘మగధీర ‘ సినిమా కోసం రాజమౌళిని సంప్రదించినప్పుడు రాజమౌళి ఆ ప్రాజెక్టుని రిజెక్ట్ చేయకుండా ఆ మూవీ చేద్దామని చెప్పి చరణ్ కి సంబంధించిన లుక్స్ ని మొత్తం మార్చేసి తనకు అనుగుణంగా రామ్ చరణ్ ను మార్చుకొని మరి ఆ సినిమాని చేశాడు.
అందువల్ల రామ్ చరణ్ సైతం రెండోవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన హీరోగా హిస్టరీలో నిలిచిపోయాడు. అలాంటి రామ్ చరణ్ ను టాప్ హీరోగా మార్చడంలో రాజమౌళి కీలక పాత్ర వహించారు. కాబట్టి రాజమౌళి తనకు చేసిన హెల్ప్ ను ఎప్పుడు చిరంజీవి గుర్తు పెట్టుకుంటూనే ఉంటారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ హీరోగా అవతరించాడు.
అలాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు తడబడ్డప్పటికి భారీ బడ్జెట్ తో చేసే సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…ఇక చిరంజీవి సైతం 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా అలవోకగా సినిమాలను చేస్తూ కుర్ర హీరోలకు పోటీని ఇస్తున్నాడు.
ఈ సంవత్సరం ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కి మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక చిరంజీవి లాంటి నటుడు ఈ ఏజ్ లో కూడా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా అహర్నిశలు కష్టపడుతున్నాడు అంటే అతనికి సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు…
