Vaibhav Suryavanshi: “ఆరోజు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది. అతడిని గెలవకుండా ఉండాల్సిందే. అనవసరంగా గెలికాం. అతడి గురించి తెలియకుండా మాట్లాడాం. చివరికి అనుభవిస్తున్నామని” కచ్చితంగా శ్రీలంక ప్లేయర్లు అనుకొని ఉంటారు. ప్రతి బంతిని అతడు కొడుతుంటే చింతించి ఉంటారు. కన్నీరు పెడుతూనే ఉంటారు.
వైభవ్ సూర్య వంశీ 15 సంవత్సరాల బుడ్డోడు మాత్రమే కాదు.. అంతకు మించిన డైనమైట్. బుమ్రా బౌలింగ్ లోనే తొలి బంతిని సిక్సర్ కొట్టిన చరిత్ర అతడిది. అంతేకాదు ఐపీఎల్లో హయ్యెస్ట్ రన్స్ చేసి.. ఆరెంజ్ టోపీ అందుకున్న ఘనత అతడిది. అటువంటి ఆటగాడిని శ్రీలంక ప్లేయర్లు అనవసరంగా గెలికారు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో.. బుడ్డోడని గేలీ చేశారు. అతడేమో మైదానంలో విశ్వరూపం చూపిస్తున్నాడు. తన బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో.. తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నాడు.
ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టు మీద సూర్య వంశీ 11 బంతుల్లోనే ఆర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 సిక్సర్లు.. ఐదు ఫోర్లు ఉన్నాయి. పరుగులు మొత్తం బౌండరీ రూపంలో వచ్చాయి వన్డే హిస్టరీ లో ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. గతంలో అంతర్జాతీయ క్రికెట్ లో డివిలియర్స్.. మాథ్యూ ఫోర్డ్ (వెస్టిండీస్) తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు.
ఇటీవల శ్రీలంక ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ అంతగా సత్తా చూపించలేదు. అతడు త్వరగానే అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్లో టీమిండియా సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్లేయర్లు సూర్య వంశీని ఉద్దేశించి గేలి చేశారు. అతడిని ఆటపట్టించారు. దీంతో సూర్య వంశీ కోపంతో వారి మీదికి వెళ్ళాడు. ఆ సంఘటన అంతర్జాతీయ క్రికెట్లో సంచలనం కలిగించింది. శ్రీలంక ప్లేయర్లు తనకు చేసిన అవమానాన్ని గుర్తుంచుకున్న సూర్య వంశీ రెచ్చిపోయాడు.
ఈ కథనం రాసే సమయానికి అతడు 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడనుకున్న క్రమంలో షాహన్ బౌలింగ్లో సూర్య అవుట్ అయ్యాడు. సూర్య ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ఆర్య 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ గా ఉన్నాయి. టీమిండియా కేవలం 9 ఓవర్లలోనే 132 పరుగులు చేయడం విశేషం.
