Pawan Kalyan Disaster Films: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాల్లో చాలా సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఇక కొన్ని మాత్రం డిజాస్టర్లుగా మిగిలాయి. ముఖ్యంగా ఆ సినిమాలన్నీ బాగున్నప్పటికి కథనంలో చిన్నపాటి తేడాల వల్ల సినిమాలు ప్లాప్ లుగా మారాయి. ముఖ్యంగా ఆయన చేసిన వైవిధ్యభరితమైన సన్నివేశాలైతే ఉంటాయి. అవి లేకుండా ఆయన సినిమాలైతే చేయడు. ఇక గతంలో ఆయన ఫుల్ లెంత్ సినిమాలను చేస్తున్న సందర్భంలో కొన్ని డిజాస్టర్లుగా మారితే ఇప్పుడు అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండు చూసుకుంటున్న సందర్భంలో ఆయన సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. కాబట్టి భారీ డిజాస్టర్లు దక్కుతున్నాయి. అతను పాలిటిక్స్ లోకి వెళ్లిన తర్వాత వచ్చిన సినిమాల్లో హరిహర వీరమల్లు, రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారాయి. వీటి బడ్జెట్ భారీగా పెరగడం వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా సరిగ్గా రాకపోవడంతో ప్రొడ్యూసర్లు తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Also Read: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడంటే?
ఇక బ్రో సినిమాతో ప్రొడ్యూసర్స్ సైతం భారీ నష్టాలైతే చవిచూశారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. లేదంటే డిజాస్టర్లుగా మారుతున్నాయి. గత సంవత్సరం వచ్చిన ఓజీ సినిమా కొంతవరకు పర్లేదు. పెట్టిన పెట్టుబడులతో పాటుగా కొంత ప్రాఫిట్స్ కూడా వచ్చాయి.
కానీ ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ సినిమా ప్లాప్ గా మారిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. హరీష్ శంకర్ సైతం ఈ సినిమాని రొటీన్ కథతో తెరకెక్కించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తీవ్రమైన నిరాశను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది…ఇక ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తే బాగుంటుంది.
అంతేతప్ప నాసిరకం కథలతో వస్తే ఆయన మరోసారి డిజాస్టర్లను మూటగట్టుకోవాల్సిందే అంటూ సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…ఇక ఇదంతా చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేసిన పర్లేదు కానీ మంచి సినిమా చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…