https://oktelugu.com/

టాప్‌ ప్లేస్‌లో ఎన్‌టీవీ.. సెకండ్‌కు పడిపోయిన టీవీ9?

 బ్రేకింగ్‌ న్యూస్‌లకు కేరాఫ్‌లా మారిన టీవీ9 ఆది నుంచీ సెన్సేషనలే. ప్రారంభం నుంచి తన సత్తాను చాటుతూ రేటింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. పదహారేళ్లుగా మొదటి స్థానంలో అప్రతిహతంగా కొనసాగుతున్న టీవీ9 తాజాగా రెండో స్థానానికి పడిపోయింది. లాక్‌డౌన్‌లోనూ టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీవీ9.. రెండో స్థానంలో ఉన్న చానల్‌ దరిదాపుల్లోకి కూడా రాలేదు. కానీ.. కొద్ది వారాల్లోనూ సీన్‌ మారిపోయింది. ఈ మధ్య ఆ చానల్‌లో జరుగుతున్న అంతర్గత గొడవలు ఇందుకు కారణంగా ప్రచారం జరుగుతోంది.. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2020 11:35 pm
    nn

    nn

    Follow us on

    nn బ్రేకింగ్‌ న్యూస్‌లకు కేరాఫ్‌లా మారిన టీవీ9 ఆది నుంచీ సెన్సేషనలే. ప్రారంభం నుంచి తన సత్తాను చాటుతూ రేటింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. పదహారేళ్లుగా మొదటి స్థానంలో అప్రతిహతంగా కొనసాగుతున్న టీవీ9 తాజాగా రెండో స్థానానికి పడిపోయింది. లాక్‌డౌన్‌లోనూ టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీవీ9.. రెండో స్థానంలో ఉన్న చానల్‌ దరిదాపుల్లోకి కూడా రాలేదు. కానీ.. కొద్ది వారాల్లోనూ సీన్‌ మారిపోయింది. ఈ మధ్య ఆ చానల్‌లో జరుగుతున్న అంతర్గత గొడవలు ఇందుకు కారణంగా ప్రచారం జరుగుతోంది.. దీనిపై అంతర్మథనం జరుగుతున్నట్లు సమాచారం. అయితే టీవీ9 లో జరుగుతున్న అంతర్మథనం ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం చానల్‌ రెండో స్థానానికి పడిపోడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.

    న్యూస్‌ ప్రెజెంటేషన్‌లో కానీ.. క్వాలిటీ మెయింటెన్‌ చేయడంలో కానీ టీవీ9కు ఏ చానల్‌ పోటీలేదు. ఇన్నాళ్లు తమకు సాటిలేదని చెప్పుకొచ్చిన ఆ చానల్‌కు ఇప్పుడు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సెకండ్‌ ప్లేస్‌లో కొనసాగుతున్న ఎన్‌టీవీ ఫస్ట్‌ టైం మొదటి స్థానానికి ఎగబాకింది. టీవీ9తో పోలిస్తే క్వాలిటీ పరంగా ఎన్‌టీవీ ఎందులోనూ సరితూగదు. టీవీ9 స్థాయిలో విస్తృతమైన ప్రోగ్రామ్స్ కూడా ఏమీ ఉండవు. కానీ.. ఇప్పుడు టీవీ9ను కిందికు నెట్టివేయడం చర్చకు దారితీసింది.

    Also Read : వైరల్: కాళ్లు మొక్కి కుర్చీ లాగేశావా అచ్చెన్నా?

    ప్రజల పక్షాన ఉండే మీడియాకు ఎల్లప్పుడూ ప్రజల నుంచి ఆదరణ ఉంటుంది. టీవీ9 మొదట్లో ఇలానే ఉన్నా.. రానురాను అధికార పార్టీలకు అనుకూలంగా మారిపోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలకు సంబంధించిన వారు చేసే పొరపాట్లు, ఆగడాలకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన ఎన్నో గంటల తర్వాత కానీ టీవీ9 లో రావడం లేదు. అది కూడా టీవీ9 లో వచ్చే సమయానికి అధికార పార్టీకి చెందిన వారి వివరణలతో సహా వస్తోంది. దీంతో ప్రజల్లో టీవీ9కు ఉన్న మైలేజీ పోయినట్లైంది. ఇటు తెలంగాణలో.. అటు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీని సవాల్ చేసే లాగా పదేళ్లలో టీవీ9 ఒక వార్త కూడా ఇవ్వలేదు అంటే అది అతిశయోక్తి కాదు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, పవన్ కళ్యాణ్ వంటి నేతలు చేసే కార్యక్రమాలకు కనీస స్క్రోలింగ్ కూడా టీవీ9 ఇవ్వదని, గల్లీ స్థాయి టీఆర్ఎస్ నాయకులు, అధికార వైఎస్ఆర్సీపీలోని చోటామోటా నాయకులు చేసే వ్యాఖ్యలకు మాత్రం తాటికాయంత అక్షరాలతో స్క్రోలింగ్ ఇస్తోందని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతూనే ఉంది.

    రవిప్రకాష్‌ నుంచి ఆ చానల్‌ మై హోమ్ రామేశ్వరరావు చేతిలోకి వెళ్లింది. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీకి ఛానల్ పూర్తిగా అనుకూలం గా మారిపోయిందనే అభిప్రాయం వినిపించింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో V6 చానల్ కాస్త తటస్థంగా ఉన్నట్లు కనిపించడం, రూరల్ తెలంగాణ పల్స్ పట్టుకునేలా ఆ చానెల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ప్రారంభించింది. ఈ  కారణంగా హైదరాబాదేతర తెలంగాణలో చాలాకాలంగా టీవీ9 రెండో స్థానానికి నెట్టేసి V6 ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ప్రేక్షకాదరణ కలిగిన V6 చానల్‌ను ఎదుర్కోవడానికి టీవీ9 చేసిన ప్రయత్నాలు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దెబ్బతీశాయి.

    టీవీ9 రేటింగులు ఇప్పుడు కొత్తగా పడిపోలేదని, 2-3 ఏళ్ల కిందటే అది మొదలైందని, అయితే టీఆర్పీలను తారుమారు చేసి టీవీ9 ఇంతకాలం ప్రచారం చేసుకుంటోందని అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇటీవల రజత్ శర్మ టీవీ9 చేస్తున్న ఈ తారుమారు వ్యవహారాల గురించి బార్క్‌కి రాసిన లేఖ మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించింది. రవి ప్రకాష్ హయాంలోనూ టీవీ9 రేటింగులు పడిపోయాయని, అయితే అప్పుడు అవి తారుమారు చేసి ప్రకటించుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా టీవీ9 చానల్ ప్రేక్షకాదరణను కోల్పోతోందనేది ఈ రేటింగ్స్‌ బట్టి చూస్తేనే అర్థమవుతోంది.ఇప్పుడైనా ఛానల్‌ తన పంథాను మార్చుకొని ప్రజల పక్షాన వార్తలు ప్రసారం చేస్తుందా.. ఇప్పటి వైఖరే కొనసాగిస్తుందా వేచి చూడాలి.

    Also Read : అన్ లాక్ 5.0: సినిమా హాళ్లు తెరుచుకోబోతున్నాయ్‌..?