NTR Surya Movie Twist: ఎన్టీఆర్ అభిమానులకు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త తీవ్రమైన విచారానికి గురి చేస్తోంది. ఎన్టీఆర్ భవిష్యత్తు లైనప్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తోటి హీరోలు వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ వెళ్తుంటే , ఎన్టీఆర్ మాత్రం ఆ రేంజ్ జోరు చూపించడం లేదని అంటున్నారు. చేతిలో ‘డ్రాగన్’ చిత్రం తప్ప మరో క్రేజీ ప్రాజెక్ట్ లేదు. త్రివిక్రమ్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ ఉంటుందని అంటున్నారు కానీ , అది అల్లు అర్జున్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోనీ ఆ సినిమా మిస్ అయ్యినా , ఎన్టీఆర్ ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు కదా, అది చాలని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా ఎన్టీఆర్ నుండి జారిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తమిళ హీరో సూర్య చేతుల్లోకి వెళ్లిందట. రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ సూర్య ని కలిసి ఒక స్టోరీ ని వినిపించాడని , అది సూర్య కి తెగ నచ్చేయడం తో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇది గతం లో నెల్సన్ ఎన్టీఆర్ కి వినిపించిన స్టోరీ నే అట. మరి ఇది ఎన్టీఆర్ నుండి సూర్య చేతుల్లోకి ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సూర్య రీసెంట్ గానే ‘కరుప్పు’ మూవీ తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా సౌత్ మార్కెట్స్ లో రాబట్టిన వసూళ్లను చూస్తుంటే , ఆయన మార్కెట్ ఇసుమంత కూడా చెక్కు చెదరలేదు , సరైన సినిమా పడితే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు అవుతాయని బలంగా నమ్ముతున్నారు ట్రేడ్ విశ్లేషకులు , నిర్మాతలు.
అందుకే ఎన్టీఆర్ తో చేయడం కంటే , సూర్య తో చేస్తే అటు తమిళం లోనూ , ఇటు తెలుగు, కేరళ , కర్ణాటక మార్కెట్స్ లోనూ వసూళ్ల సునామీ ని సృష్టించవచ్చు అని , నెల్సన్ సూర్య కి షిఫ్ట్ అయ్యినట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్ 2’ షూటింగ్ ని పూర్తి చేసాడు. త్వరలోనే రజినీకాంత్ , కమల్ హాసన్ మల్టీ స్టార్రర్ మూవీ ని తెరకెక్కించబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతే సూర్య సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా , నెల్సన్ – సూర్య కాంబినేషన్ లో సినిమా అనే వార్త సూర్య ఫ్యాన్స్ ని సంబరాలు చేసుకునేలా చేస్తే , ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నిరాశలోకి నెట్టేలా చేసింది.
