Laxmiparvathi -NTR: లక్ష్మీపార్వతిని గర్భవతిని చేసిన ఎన్టీఆర్.. ఆ బిడ్డను ఏం చేశారో తెలుసా? సంచలన వీడియో లీక్

Laxmiparvathi -NTR: తెలుగు సినిమా తెరపై.. రాజకీయ యవనికపై చెరగని ముద్రవేశాడు అన్న నందమూరి తారక రామారావు. అప్పటికే బాసవతరకంతో 13 మంది పిల్లలను కని వారిని ప్రయోజకులు చేసిన సీనియర్ ఎన్టీఆర్.. ఆమె చనిపోయాక లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎన్టీఆర్ ను వెళ్లగొట్టడం.. చంద్రబాబు హస్తగతం చేసుకోవడం.. ఆ బాధలో ఎన్టీఆర్ మరణించడం తెలుగు చరిత్రలో ఇదొక విషాదగాధగా మిగిలిపోయింది. అయితే నాడు 13మందిని కన్న ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతితోనూ […]

Written By: NARESH, Updated On : September 26, 2022 11:48 am
Follow us on

Laxmiparvathi -NTR: తెలుగు సినిమా తెరపై.. రాజకీయ యవనికపై చెరగని ముద్రవేశాడు అన్న నందమూరి తారక రామారావు. అప్పటికే బాసవతరకంతో 13 మంది పిల్లలను కని వారిని ప్రయోజకులు చేసిన సీనియర్ ఎన్టీఆర్.. ఆమె చనిపోయాక లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎన్టీఆర్ ను వెళ్లగొట్టడం.. చంద్రబాబు హస్తగతం చేసుకోవడం.. ఆ బాధలో ఎన్టీఆర్ మరణించడం తెలుగు చరిత్రలో ఇదొక విషాదగాధగా మిగిలిపోయింది.

అయితే నాడు 13మందిని కన్న ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతితోనూ ఒక బిడ్డకు తండ్రి అయ్యేవాడే. ఈ మేరకు ఆమెను గర్భవతిని కూడా చేశాడని.. కానీ ఆ వయసులో బిడ్డను కనడం సమంజసం కాదని వద్దనుకున్నామని లక్ష్మీపార్వతి సంచలన నిజాలు చెప్పుకొచ్చింది.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘లక్ష్మీపార్వతితో తనకు ఒక బిడ్డ కావాలని’ ఎన్టీఆర్ స్వయంగా అడిగాడని.. దానికి ‘నీ ఇష్టం స్వామి.. మీరు ఏం చేయమంటే నేను అది చేస్తానని’ అన్నానని లక్ష్మీపార్వతి ఆ వీడియోలో తెలిపింది.

ఈ క్రమంలోనే తాను గర్భవతిని అయ్యానని.. కానీ నాడు ఎందుకో ఎన్టీఆర్ వద్దనుకొని గవర్నమెంట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చింది. దానికి కారణం వయసు పైబడడం.. ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోవడం.. ఇన్ని కష్టాల మధ్యన ఈ వయసులో బిడ్డను కనడం మంచిది కాదని.. 3 నెలల గర్భం ఉన్నప్పుడు ఆబార్షన్ చేయించాడని లక్ష్మీపార్వతి సంచలన నిజాలు చెప్పుకొచ్చింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ‘యుగపురుష్ ఖాతా లో మరో సంతానం ఉండేది… యుగపురుషునికి 13వ అధికారిక సంతానం’ అయ్యిండేది అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే చిలిపిగా.. ‘చంద్రబాబుగారికి బుల్లి బామ్మర్ది, బాలయ్యకు చిన్నితమ్ముడు, జూ.ఎన్టీఆర్‌కు చిట్టిబాబాయ్, పురందేశ్వరిగారి కొడుక్కి బుజ్జిమేనమామయ్య, అన్నింటికీ మించి తెలుగుదేశంపార్టీకి భావి అధ్యక్షుడు… ఫాఫమ్ మిస్‌క్యారీ అవడంతో మిస్సయ్యాడు.’’ అంటూ హాట్ కామెంట్స్ తో ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో