NTR Dragon Release Date: అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఎన్టీఆర్(Junior NTR) ‘డ్రాగన్'(Dragon Movie) మూవీ అప్డేట్ వచ్చేసింది. అన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారం కుదిరి ఉండుంటే ఈ చిత్రం ఈ ఏడాది జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ రావడం తో విడుదల తేదీని ప్రకటించలేకపోయారు మేకర్స్. అయితే నేడు ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ , ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా , అది బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ లో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11 న విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అదే విధంగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20 న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు.
ముందుగా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ తో సరిపెట్టాలని అనుకున్నారు కానీ , అభిమానుల నుండి డిమాండ్ ఎక్కువగా రావడం తో గ్లింప్స్ వీడియో ని విడుదల చేయడానికి సిద్ధపడ్డారు మేకర్స్. ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియన్ టాప్ మోస్ట్ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం తో ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు బలమైన కంటెంట్ ని కూడా విడుదల చేస్తే, ఇక ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుతాయి. పోస్టర్ ని చూస్తుంటే , ఇది కూడా ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్ , సలార్ తో పోలినట్టు గా అనిపిస్తోంది. ఇది తన నెల , తన రాజ్యం అంటూ ఎన్టీఆర్ ఒక క్యాప్షన్ పెడుతాడు. అంటే ఇందులో ఆయన మాఫియా సామ్రాజ్యానికి అధినేత గా కనిపించబోతున్నాడా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్.
మరి కొంతమంది అయితే , ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వీటిల్లో ఏది నిజం అనే క్లారిటీ రావాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. ఆరోజు గ్లింప్స్ వీడియో ని విడుదల చేస్తారు కాబట్టి, ఈ సినిమాని ఎలాంటి స్టోరీ తో తెరకెక్కిస్తున్నారు అనే విషయం అర్థం అవ్వుద్ది. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటిస్తోంది. విలన్ క్యారక్టర్ కోసం పలువురి యంగ్ హీరోలను సంప్రదిస్తున్నారు మేకర్స్. అత్యధిక శాతం రీ షూట్స్ జరుగుతూ ఉండడం తో , వచ్చే ఏడాది జూన్ లో కూడా ఈ సినిమా విడుదల కష్టమే అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.
HIS REIGN… HIS SOIL…
JUNE 11, 2027… IT IS…. #NTRNeel pic.twitter.com/ln9Dq4BFZs— Jr NTR (@tarak9999) April 21, 2026