Homeఎంటర్టైన్మెంట్Balakrishna Koratala Siva collaboration: కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ.. 'దేవర 2' ఇక...

Balakrishna Koratala Siva collaboration: కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ.. ‘దేవర 2’ ఇక లేనట్టే..

Balakrishna Koratala Siva collaboration: ఆచార్య వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ‘దేవర’ తో చిత్రం తో మంచి కం బ్యాక్ ఇచ్చిన కొరటాల శివ, తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడు అనే దానిపై ఇన్ని రోజులు సోషల్ మీడియా లో చర్చలు నడిచాయి. ‘దేవర 2’ ని ప్రారంభిస్తాడని అంతా అనుకున్నారు. కానీ కమర్షియల్ పరంగా చూసుకున్నా , కథ పరంగా చూసుకున్నా ఆ సినిమా వర్కౌట్ అవ్వడం అసాధ్యమని, వేరే ఏదైనా […]

Balakrishna Koratala Siva collaboration: ఆచార్య వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ‘దేవర’ తో చిత్రం తో మంచి కం బ్యాక్ ఇచ్చిన కొరటాల శివ, తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడు అనే దానిపై ఇన్ని రోజులు సోషల్ మీడియా లో చర్చలు నడిచాయి. ‘దేవర 2’ ని ప్రారంభిస్తాడని అంతా అనుకున్నారు. కానీ కమర్షియల్ పరంగా చూసుకున్నా , కథ పరంగా చూసుకున్నా ఆ సినిమా వర్కౌట్ అవ్వడం అసాధ్యమని, వేరే ఏదైనా ప్రాజెక్ట్ చూసుకోమని ఎన్టీఆర్ కొరటాల కి చెప్పినట్టు చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ ప్రచారం లో నిజం ఉందట. కొరటాల తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ తో చేయడానికి సిద్ధం అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది నుండే బాలయ్య , కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు టాక్. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో నందమూరి అభిమానులకు పిచ్చెక్కిపోయేలా చేస్తున్న బాలయ్య , ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ అభిమానులకు భుక్తాయాసం రప్పించే రేంజ్ లో ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన వివేక్ ఆత్రేయ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి అయ్యాకనే కొరటాల తో సినిమా చేసే అవకాశం ఉంటుంది. అయితే కొరటాల మేకింగ్ స్టైల్ కి బాలయ్య అసలు సూట్ అవుతాడా అనే సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

కొరటాల సినిమా లో హీరోలు చాలా నెమ్మదిగా ఉంటారు. ఆ తత్వంతోనే పీక్ హీరోయిజాన్ని పండిస్తుంటారు. తక్కువ మాటలు , ఎక్కువ హీరోయిజం అనేది కొరటాల శివ నమ్మిన సిద్ధాంతం. కానీ బాలయ్య ని చూస్తే భీకరమైన గొంతుతో భారీ డైలాగ్స్ కొడుతూ , వేరే లెవెల్ ఎలివేషన్స్ ని వెండితెర పండిస్తుంటాడు. వీళ్లిద్దరి కలయిక లో సినిమా వస్తే , అది కొరటాల స్టైల్ లో ఉంటుందా ?, లేదంటే రెగ్యులర్ బాలయ్య సినిమా స్టైల్ లో ఉంటుందా అనేది చూడాలి. చిరంజీవి ని కొరటాల శివ తన స్టైల్ లోనే ఆచార్య లో చూపించాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు , బాలయ్య ని తన స్టైల్ టేకింగ్ తో చూపిస్తే ‘ఆచార్య’ నే రిపీట్ అవ్వొచ్చు , మరి బాలయ్య ని కొరటాల ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper