Nari Nari Naduma Murari Closing Collections: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న శర్వానంద్(Sharwanand), ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకొని మళ్లీ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అసలు అంచనాలే ఉండేవి కాదు. నాలుగు సినిమాల మధ్య వస్తుంది, ఎంతో కొంత వసూళ్లను పోగు చేసుకోవడం కోసమే, హిట్ అవుతుందనే నమ్మకం లేదంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అత్యధిక శాతం మందికి ఈ చిత్రం విడుదల అయ్యింది అనే విషయం కూడా మొదటి రోజు తెలియదు. అలాంటి తక్కువ బజ్ తో విడుదలై, మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
థియేట్రికల్ రన్ ని వరల్డ్ వైడ్ గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. శర్వానంద్ గత చిత్రానికి వరల్డ్ వైడ్ కలిపి కూడా ఇంత షేర్ వసూళ్లు రాలేదు . దీనిని బట్టీ ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విద్మగా సీడెడ్ ప్రాంతం నుండి దాదాపుగా ఈ చిత్రానికి కోటి 60 లక్షల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కోస్తాంధ్ర ప్రాంతం నుండి అయితే ఏకంగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 15 కోట్ల 60 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల నుండి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి ఏకంగా 3 కోట్ల 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ కి దాదాపుగా 10 కోట్ల రూపాయిల లాభం వచ్చింది. రీసెంట్ గానే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైంది. థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, ఇక్కడ కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం.