Nagarjuna: టాలీవుడ్ లో హీరోయిజం ఎంతో మందికి ఉన్నా.. అంతకుమించిన వ్యాపార దృక్పథం ఉన్న హీరో మన నాగార్జున మాత్రమే. చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్ లు అగ్రహీరోలుగా ఉన్నా వారు వ్యాపారాలు చేసింది చాలా తక్కువ. కేవలం నటించి వారి వ్యాపకాల్లో వారు ఉన్నారు. కానీ నాగార్జున మాత్రమే హీరోగానే కాదు.. ఒక దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఒకటి కాదు రెండూ చాలా రంగాల్లో నాగార్జున పెట్టుబడులు పెట్టి వేల కోట్లు సంపాదించారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఓసారి ఫోర్బ్స్ సినీ ప్రముఖుల జాబితాలోనూ నాగార్జున చోటు సంపాదించడం విశేషం. అయితే నాగార్జున ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యం వెనుక ఒక వ్యక్తి ఉన్నారని తాజాగా సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
టాలీవుడ్ లోని మూలస్తంభాల్లో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం ఒకటి. సినిమాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఏఏన్నార్ వ్యాపారంలో మాత్రం రాణించలేదు. కానీ నాగార్జున అలా కాదు. ఓవైపు సినిమాల్లో హీరోగా చేస్తూనే… వ్యాపారంలోనూ పెట్టుబడులు పెట్టి.. విభిన్న రంగాలకు విస్తరించి వేలకోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.
Also Read: Chain Snatching Lovers: పిచ్చి ప్రేమ.. లవర్ కోసం ఈ ప్రియురాలు చేసిన దారుణం
నాగార్జున చదువకునే టైంలో యావరేజ్ స్టూడెంట్. కానీ లెక్కల్లో మాత్రం తోపు అని చెబుతారు. అందుకే హీరోగా ఉంటూనే బోలెడు వ్యాపారాలు మొదలుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మందికి వ్యాపారాల్లో ఆదర్శంగా నిలిచారు. నాగార్జున కోరికతోనే చిరంజీవి కూడా వ్యాపార రంగంలోకి వచ్చారంటే అతిశయోక్తి కాదు.
తాను సంపాదించిన సొమ్ములో ప్రతి రూపాయిని త్రిబుల్ చేసేలా నాగార్జున వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. మా టీవీని నిమ్మగడ్డ ప్రసాద్ స్థాపించిన సమయంలో అందులో నాగార్జున పెట్టుబడులు పెట్టారు. ఇక దీన్ని విస్తరించినప్పుడు చిరంజీవిని ఇందులో పెట్టుబడులకు ప్రోత్సహించి ఒప్పించారు. ఈ క్రమంలోనే మా టీవీ తెలుగునాట బాగా క్లిక్ అయ్యాక ఏకంగా 2వేల కోట్లకు పైగా ఈ టీవీని స్టార్ సంస్థకు అమ్మేసి వేల కోట్లను నాగార్జున వెనకేసుకున్నారన్న ప్రచారం ఉంది.. నాగార్జున మాట విన్న చిరంజీవి కూడా బాగా లాభపడ్డారట.
ఇక నాడు జగన్ కంపెనీల భాగస్వామిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ తో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సాన్నిహిత్యం ఉండేది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టులు నిమ్మగడ్డకు దక్కాయి. హైదరాబాద్ శివారుల్లో నాగార్జున కొన్న స్థలాల చుట్టుపక్కలనే ఔటర్ రింగ్ రోడ్డు సహా పలు ప్రాజెక్టును డిజైన్ చేసేలా నిమ్మగడ్డ చక్రం తిప్పారని.. నాగార్జునకు ఇతోదిక సహాయం చేశారని ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇలా తన భూములకు భారీ రేటు వచ్చి నాగార్జున కోట్లకు పడగలెత్తారని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇలా జగన్ తో.. వైఎస్ఆర్ తో సాన్నిహిత్యాన్ని పెంచుకొని.. నిమ్మగడ్డ సాయంతో నాగార్జున కొన్ని వేల కోట్లు సంపాదించాడని ఓ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. అదిప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read:KA Paul: కేఏ పాల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారు? ఆయనకు పుషింగ్ ఇచ్చే వారెవరు?