Nani: సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది పాపులారిటిని సంపాదించుకుంటున్నారు. ఇక యూట్యూబ్ లో ఫోక్ డాన్సర్ గా అదరగొట్టిన నాగ దుర్గ సైతం ప్రస్తుతం హీరోయిన్ గా అవతరించింది. ఇప్పటికే తమిళంలో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో ‘కలి వనం’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ప్రస్తుతం ఆమె ప్రియదర్శి హీరోగా సుకుమార్ రైటింగ్స్ లో వంశీకృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె ఆ మూవీలో నటిస్తున్నందుకు గాను ఆమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే గత వారం రోజుల నుంచి ఇడుపు కాయితం సినిమాకు సంబంధించిన ఒక కాంట్రవర్సీ ఇష్యూ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఈ విషయాన్ని పక్కన పెడితే నాగ దుర్గ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంతకుముందే సినిమా అవకాశాలు వచ్చాయని కానీ తను ఆ సినిమాలను చేయడానికి నిరాకరించింది అంటూ ఒక ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో సాయి పల్లవి చేసిన క్యారెక్టర్ కోసం మొదట నాగదుర్గ ను అనుకున్నారట.
కానీ నాగ దుర్గ ఆ పాత్రను చేయడానికి ఇష్టపడలేదట. కారణం ఏంటి అంటే ఆమె క్లాసికల్ డాన్సర్ గా పి హెచ్ డి చేయాలని అనుకుంది. అందువల్లే ఆమె చదువుకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇక విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా కోసం కూడా తనను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ సినిమా అవకాశాన్ని కూడా తను రిజెక్ట్ చేసింది.
మొత్తానికైతే ‘ఇడుపు కాయితం’ సినిమాలో తను హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఫోక్ డాన్సర్ గా అదరగొట్టిన ఆమె హీరోయిన్ గా ఏ మేరకు మెప్పిస్తుంది ప్రేక్షకులను మ్యాజిక్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
