https://oktelugu.com/

లోకేష్‌ ఎక్కడా!.. ఇప్పుడిదే హాట్ టాపిక్?

తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడైతే కరోనా వైరస్‌ అడుగుపెట్టిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కరోనా టైంలో ఎవరిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. మొన్నటి వరకు అత్యవసరం అయితే తప్ప, ఏపీలో అడుగు పెట్టేందుకు కూడా ఇష్టపడలేదు. ఇక్కడకు వచ్చినా సర్వం జూమ్ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారే తప్ప.. కార్యకర్తలను, క్యాడర్‌‌ను నేరుగా కలువ లేదు. కలువనీయలేదు. Also Read: అందుకే జగన్‌ను లెక్క చేయడం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 9:56 am
    Follow us on

    Nara Lokesh

    తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడైతే కరోనా వైరస్‌ అడుగుపెట్టిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కరోనా టైంలో ఎవరిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. మొన్నటి వరకు అత్యవసరం అయితే తప్ప, ఏపీలో అడుగు పెట్టేందుకు కూడా ఇష్టపడలేదు. ఇక్కడకు వచ్చినా సర్వం జూమ్ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారే తప్ప.. కార్యకర్తలను, క్యాడర్‌‌ను నేరుగా కలువ లేదు. కలువనీయలేదు.

    Also Read: అందుకే జగన్‌ను లెక్క చేయడం లేదా..!

    కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో ఆందోళనలోనే ఉన్న బాబు విశ్రాంతి తీసుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సమయంలో ఆక్టివ్‌గా ఉండాల్సిన ఆయన తనయుడు, రాజకీయ వారసుడు లోకేష్ సైతం పెద్దగా యాక్టివ్‌ రోల్‌ ప్లే చేయడం లేదు. ఆయన సైతం హైదరాబాద్‌లోని నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉండటం చర్చనీయాంశం అయింది.

    చంద్రబాబు వయసు రీత్యా యాక్టివ్‌గా ఉండే అవకాశం లేకపోవడంతో, లోకేష్ ఒక దారిలో పడ్డారని, పార్టీని గాడిలో పెడతారని అంతా భావించారు. అయితే.. రెండు మూడు రోజులపాటు వివిధ జిల్లాల్లో పర్యటనలు చేసి హడావుడి చేసిన చినబాబు కూడా ఏపీకి దూరంగా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. పార్టీలో వివిధ కమిటీల పేరుతో పదవులు ఇచ్చినా, నాయకులలో ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదు. ఈ సమయంలో అటు బాబు కానీ, ఇటు లోకేష్ కానీ, పార్టీని పట్టించుకోకుండా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

    Also Read: మహిళల బ్యాంక్ అకౌంట్లలో రూ.3 లక్షలు వేస్తున్న మోదీ.. నిజమేనా..?

    మరోవైపు ఏపీలోని తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల హడావుడి ప్రారంభం అవుతోంది. ఇక్కడ గెలిచేందుకు అన్ని పార్టీలూ అస్త్రశస్త్రాలను ఉపయోగించే పనిలో ఉన్నాయి. ఈ సమయంలో పార్టీ నాయకులలో హుషారు తీసుకొచ్చి, వారిని ముందుకు నడిపించాల్సిన లోకేష్ సైతం ఇప్పుడు అజ్ఞాతవాసం గడుపుతుండటంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ఏపీలోనే కాకుండా, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ సమయంలో అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో యాక్టివ్‌గా ఉండకుండాసైలెంట్ కావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.