Megastar Chiranjeevi: ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad gaaru) చిత్రానికి వార్ వన్ సైడ్ అయిపోయింది. ప్రభాస్ ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం ఫ్లాప్ అవ్వడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది , కానీ ఆ తర్వాత విడుదలైన నాలుగు సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, అయినప్పటికీ కూడా జనాలకు చిరంజీవి సినిమానే మొదటి ఛాయస్ గా ఉండడాన్ని చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది, మిగిలిన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చింది. ‘డాకు మహారాజ్’ చిత్రం బాగుందని అందరూ అనేవారు కానీ, సంక్రాంతికి చూసే జానర్ సినిమా కాకపోవడం తో యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితులు వేరే, అన్నీ సినిమాలు ఎంటర్టైన్మెంట్ జానర్ లో తెరకెక్కినవి, ‘రాజా సాబ్’ కి తప్ప అన్నిటికి పాజిటివ్ టాక్స్ వచ్చాయి.
అయినప్పటికీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఆధిపత్యం చూపించడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా బుక్ మై షో యాప్ స్టేటస్ ని చూసిన తరవాత ట్రేడ్ పండితులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3 లక్షల 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అది పక్కన పెడితే మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా 4 లక్షల 80 వేల టికెట్స్ అమ్ముడుపోగా, రెండవ రోజున 4 లక్షల 5 వేల టిక్కెట్లు, మూడవ రోజున 4 లక్షల 45 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా కేవలం బుక్ మై షో యాప్ నుండే ఈ సినిమాకు 16 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. బుక్ మై షో కాకుండా డిస్ట్రిక్ట్ యాప్ లో ఇక ఏ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోయి ఉంటాయో మీరే ఊహించుకోండి.
ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక శాతం థియేటర్స్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ లోనే ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో కచ్చితంగా 2 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడుపోయి ఉంటుందని, ఓవరాల్ గా బుక్ మై షో + డిస్ట్రిక్ట్ యాప్ కలిపి 36 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయి ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఈ రేంజ్ లో ఇప్పటి వరకు టికెట్స్ అమ్ముడుపోలేదు. అలాంటిది ఈ చిత్రానికి ఈ స్థాయి టికెట్స్ అమ్ముడుపోవడం చూస్తుంటే మెగాస్టార్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. మరో విశేషం ఏమిటంటే, అన్ని ప్రాంతాల్లోనూ దాదాపుగా ఆదివారం వరకు టికెట్స్ అమ్ముడుపోయాయి, ఇలా హిస్టరీ లో ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా జరగలేదు.