Sankranthi Movies 2026: ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా, భారీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న సినిమా ‘ది రాజా సాబ్'(The Rajasaab ). ప్రభాస్(Rebel star Prabhas) హీరో గా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు ఓపెనింగ్స్, మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ చాలా గట్టిగా వచ్చాయి. కానీ సోమవారం నుండి మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చిన తర్వాత దాదాపుగా ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో క్లోజింగ్ రేంజ్ కి వచ్చేసింది. అయితే ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ, మధ్యలో డ్రాప్స్ నమోదు అయినప్పటికీ, సంక్రాంతి సెలవుల్లో కచ్చితంగా మళ్లీ పికప్ అవుతుంది, యావరేజ్ రేంజ్ లో ఆడుతుందని అంతా అనుకున్నారు.
కానీ సంక్రాంతికి విడుదలైన మిగిలిన మూడు సినిమాలకు కూడా ఆడియన్స్ మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి హీరో గా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ రావడం తో , ఆడియన్స్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత సెకండ్ ఛాయస్ గా ఈ సినిమాని ఎంచుకుంటున్నారు. ఇక రవితేజ, శర్వానంద్ మూవీస్ కి కూడా పాజిటివ్ టాక్ రావడం తో ఆడియన్స్ ‘రాజా సాబ్’ చిత్రాన్ని పూర్తిగా మర్చిపోయారు. దీంతో ‘రాజా సాబ్’ చిత్రాన్ని బయ్యర్స్ థియేటర్స్ నుండి తీసేస్తున్నారు. హైదరాబాద్ లాంటి టాప్ సిటీ లో, సినిమా విడుదలై వారం రోజులు కూడా పూర్తి కాకముందే నేషనల్ మల్టీ ప్లెక్స్ చైన్స్ మొత్తం కలిపి పట్టుమని పది షోస్ కూడా లేకపోవడాన్ని చూస్తుంటే ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది మీరే అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీ లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా ఇలా జరగలేదు. అయితే రాజాసాబ్ చిత్రాన్ని జనవరి 9 న విడుదల చేసి మేకర్స్ పెద్ద తప్పు చేశారా?, ఒకవేళ ఆ చిత్రాన్ని జనవరి 12 లేదా జనవరి 13న విడుదల చేసుంటే ఈ చిత్రానికి డీసెంట్ రేంజ్ రన్ ఉండేదా?, కేవలం నాలుగు రోజులకే థియేట్రికల్ రన్ ఆగిపోకుండా, పది రోజుల థియేట్రికల్ రన్ ని ఈ చిత్రం సొంతం చేసుకునేదా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అన్ని సినిమాలకంటే ముందుగా ‘రాజా సాబ్’ చిత్రం రావడం వల్ల, ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ వ్యాప్తి చెందేందుకు పూర్తి స్థాయి స్కోప్ దొరికింది. ఒకవేళ జనవరి 13 న విడుదల అయ్యుంటే పండగ హడావిడిలో ఆడేసి ఉండేదని అంటున్నారు.