Nari Nari Naduma Murari: శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి ఈవినింగ్, నైట్ షోస్ మాత్రమే వేశారు. ఈ సంక్రాంతికి సినిమాల సంఖ్య పెరిగిపోవడం వల్ల థియేటర్లో ఎక్కువగా దొరకలేకపోతున్నాయి. దానివల్ల థియేటర్ల కొడితే ఏర్పడింది. ముందు రిలీజ్ అయిన సినిమాలకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లను ఇవ్వడంతో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాకి ఈవినింగ్ షోస్, నైట్ షోస్ మాత్రమే వేసుకునే అవకాశమైతే కల్పించారు. ఇక శర్వానంద్ హీరోగా చేసిన ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
ఈ మూవీ లో శర్వానంద్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. రన్ రాజా రన్ టైమ్ లో ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాంటి లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తను చేసిన కామెడీ కూడా ప్రేక్షకులకు నచ్చింది… అలాగే సీనియర్ నరేష్ సైతం తన కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. ఈ సినిమాలో సైతం మరోసారి చాలా మంచి పాత్రను పోషించి తన నటనలో ఎంత పరిణీతిని సాధించాడో మరోసారి ప్రేక్షకులందరికి చూపించాడు… సునీల్, సత్య, వెన్నెల కిషోర్లు చేసిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీ విష్ణు క్యామియో అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది…
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో గొప్పగా చెప్పుకునే కథ అయితే ఏమీ లేదు. సినిమా కథంతా రొటీన్ గా ఉంది. అలాగే ప్రేక్షులకు థ్రిల్ కలిగించే అంశాలు ఏమీ లేవు. కేవలం నవ్వించడానికి మాత్రమే సినిమాను తీసినట్టుగా అనిపించింది. అలా కాకుండా కూడా థ్రిల్లింగ్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్లేది…
సినిమాలో కాన్ఫ్లిక్ట్ సైతం ప్రేక్షకుడికి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. వీటన్నింటి వల్ల సినిమా మీద ఇంపాక్ట్ అయితే తగ్గింది. అలా కాకుండా ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చి అందులో కామెడీని చేర్చి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది…