https://oktelugu.com/

Chiranjeevi – Akkineni nageshwara rao : నాగేశ్వర రావు, చిరంజీవి కలిసి నటించిన ఆ సినిమా ఏంటో తెలుసా..?

ఇక ఈ సినిమా అటు అక్కినేని అభిమానులను, ఇటు మెగా అభిమానులను నిరాశపరిచింది...అలా వీళ్ల కాంబో లో వచ్చిన ఆ ఒక్క సినిమా మెప్పించలేకపోయింది..

Written By: , Updated On : September 25, 2023 / 01:12 PM IST
chiru-1 akkineni nageshwara rao

chiru-1 akkineni nageshwara rao

Follow us on

Chiranjeevi – Akkineni nageshwara rao : సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి అంటే కష్టానికి మరొక పేరు గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి సినిమా షూటింగ్ కి ఆయన ఒప్పుకున్నాడు అంటే వరద వచ్చిన, ఉరుము వచ్చిన, పిడుగు వచ్చిన ఏది వచ్చిన సరే మార్నింగ్ 6 గంటలకి ఆయన లొకేషన్ లో ఉంటాడు షూట్ లో పాల్గొంటాడు. ఎందుకంటే ఒక్క రోజు షూట్ క్యాన్సల్ అయితే ప్రొడ్యూసర్ కి ఎంత నష్టం వస్తుందో ఆయనకి తెలుసు అందుకే ఆయన్ని అందరు అన్నయ్య అంటారు అందరి గురించి ఆలోచించే ఒక పెద్ద మనిషి తను…

ఈయన ఇండస్ట్రీ కి తన స్వయం కృషి తో వచ్చి ఇక్కడ మంచి విజయాలను అందుకొని మెగాస్టార్ గా ఎదిగాడు అయితే అలాగే చాలా మంది కి ఇక్కడ ఆదర్శంగా కూడా నిలిచాడు.ఇక చిరంజీవి కంటే ముందే ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా గుర్తింపు పొందిన నటుడు నాగేశ్వర్ రావు ఈయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో సూపర్ సక్సెస్ అయ్యేవి. ఇక ఎన్టీయార్, నాగేశ్వర రావు లు అప్పట్లో ఇండస్ట్రీ కి రెండు పిల్లర్స్ గా ఉండేవారు ఇక వీళ్ల తర్వాత కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరో లు వచ్చి వాళ్ళు కూడా ఇండస్ట్రీ లో పాతుకు పోయారు ఇక వీళ్లు నలుగురు స్టార్ హీరో లు గా ఉన్నప్పుడు మొదట చిరంజీవి ఇండస్ట్రీ కి సెకండ్ హీరో గా అడుగుపెట్టి ఆ తర్వాత సోలో హీరో గా ఎదిగాడు.అయితే చిరంజీవి నాగేశ్వర రావు ఇద్దరు కూడా మంచి నటులు అనేది మనకు తెలుసు వీళ్లిద్దరు కలిసి ఒక సినిమాలో నటించిన విషయం మాత్రం చాలా మంది కి తెలీదు.

అది ఏ సినిమా అంటే మెకానిక్ అల్లుడు బి గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు.అయితే వీళ్లిద్దరు కలిసి నటించడం వల్ల ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా మంచి అంచనాలే ఉన్నాయి. అందుకే భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది…ఈ సినిమా లో లేడి సూపర్ స్టార్ అయినా విజయ శాంతి హీరో యిన్ గా నటించింది.ఇక ఈ సినిమా అటు అక్కినేని అభిమానులను, ఇటు మెగా అభిమానులను నిరాశపరిచింది…అలా వీళ్ల కాంబో లో వచ్చిన ఆ ఒక్క సినిమా మెప్పించలేకపోయింది…ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తూ చాలా బిజీగా తన కెరియర్ ని గడుపుతున్నాడు…