Silk Smitha: సిల్క్‌స్మిత.. ఈ పరిచయం అక్కరలేని పేరు. ఒకప్పుడు టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. అని తేడా లేకుండా ఐటం స్టార్‌గా సిని ఇండస్ట్రీని ఓ ఊపు ఊసేసింది. ఒక దశలో సిల్క్ ఐటం సాంగ్ లేకుండా సినిమా తీయడానికే డైర్టెర్లు భయపడిన పరిస్థితి. జ్యోతిలక్ష్మి, జయమాలిని తర్వాత ఆ స్థానంలో నిలిచింది సిల్క్‌స్మిత. స్పెషల్‌గా ఐటమ్ సాంగ్‌లకు కేరాఫ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉన్న సిల్క్‌స్మిత సినిమాల్లో నటించాలని చిన్నతనం నుంచే ప్రయత్నాలు చేసింది. ఆమె కళ్లు ఇండస్ట్రీలోకి రావడానికి ఓ కారణంగా చెప్పవచ్చు.
ఆ హీరోయిన్ ఇంట్లో పనిమనిషిగా..
ఈ క్రమంలోనే వారికి తెలిసిన వారి ద్వారా చెన్నై వెళ్లిన సిల్క్‌స్మిత.. అవకాశాలు లేకపోవడం.. పెద్దగా చదువు లేకపోవడంతో కొంతమంది ఇళ్లలో పని మనిషిగా చేరింది. ఇలా సిల్క్ స్మిత సినిమాల్లోకి రాకముందు చాలా కష్టపడి జీవితాన్ని గడిపింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అపర్ణ ఇంట్లో కూడా సిల్క్‌స్మిత పనిచేసింది. ఇల్లు తుడవడం, అంట్లు తోమడం, ముగ్గులు పెట్టడం వారు చెప్పిన పనులన్నీ సిల్క్‌స్మిత చేసేదట. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపుని తెచ్చుకుంది.
సిల్ అంటే ఐటం.. ఐటం అంటే సిల్క్ అనేలా..
హీరోయిన్ అవుదామని అడుగు పెట్టిన సిల్క్ స్మిత.. తన మత్తు కళ్లు, ఆకట్టుకునే శరీరాకృతి కారణంగా ఐటం స్టార్‌గా వెలుగు వెలిగింది. ఐటమ్ సాంగ్‌లలో నటించి తనకు మరెవరూ సాటి లేరని చెప్పకనే చెప్పింది. అయితే కష్టాల్లో ఉన్న సమయంలో ఇండస్ట్రీ ఆమెను పట్టించుకోలేదు. కుటుంబసభ్యులు కూడా దూరం పెట్టారు. ఒంటరిగానే ఇండస్ట్రీకి వచ్చింది. తన టాలెంట్‌తో ఓ వెలుగు వెలిగింది. చివరకు ఒంటరిగానే వెళ్లిపోయింది.
200 సినిమాల్లో నటన..
సిల్క్‌స్మిత తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా అనే పదం లేకముందే.. పాన్ ఇండయా స్టార్‌గా ఎదిగింది. చివరకు మానసిక ఒత్తిడి.. ఒంటరితనం, ఇతర కారణాలతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది సిల్క్ స్మిత.