https://oktelugu.com/

Dhee Chaitanya Master : ‘ఢీ’ చైతన్య మాస్టర్ కుటుంబానికి మెగా ఫ్యామిలీ చేయూత..ఎంత ఆర్థిక సహాయం చేసారో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

మెగా ఫ్యామిలీ తరుపున భారీ ఎత్తున ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం కూడా త్వరలోనే చేయబోతున్నారట. సుమారుగా 10 లక్షల రూపాయలకు పైగా ఆర్హిక సహాయం చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : May 10, 2023 / 10:59 PM IST

    Chaitanya Master Mother

    Follow us on

    Dhee Chaitanya Master : ఇండస్ట్రీ లో ఆపదలో ఉన్నవారికి అభయహస్తం ఇచ్చే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి గారి ఉన్నతమైన మనసు ,తన వారసులకు కూడా వచ్చింది. సాటిమనిషి కష్టం లో చూడలేని మనస్తత్వం ఉన్నవాళ్లు ఈ కుటుంబమంతా. అందుకే ఈ కుటుంబం నుండి వచ్చిన ప్రతీ హీరో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకునే అదృష్టం దక్కించుకున్నారు.

    ఇకపోతే రీసెంట్ గా మన అందరిని బాగా డిస్టర్బ్ చేసిన సంఘటన ‘ఢీ’ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. ఢీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు తన అద్భుతమైన డ్యాన్స్ తో దగ్గరయ్యాడు.చూసేందుకు ఎంతో జాలిగా కనిపించే ఈయన మనసులో ఆత్మహత్య చేసుకునేంత బాధ మనసులో దాగి ఉందని మాత్రం ఎవ్వరు ఊహించలేకపోయారు. ఆర్ధిక కష్టాలను తట్టుకోలేక, అప్పులోళ్ల తాకిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చైతన్య చనిపోయే ముందు సెల్ఫీ వీడియో లో చెప్పాడు.

    అయితే ఈ విషయాన్నీ తెలుసుకున్న మెగా బ్రదర్ నాగబాబు చాలా దిగులు చెండాడట.అతని డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ని నాగబాబు చాలా ఎంజాయ్ చేసేవాడట.ఇతను చనిపోయాడు, అది కూడా ఆత్మహత్య చేసుకొని అని తెలియడం తో ఆయన చాలా దిగ్బ్రాంతికి గురయ్యాడు అట, వెంటనే చైతన్య అమ్మగారి ఫోన్ నెంబర్ కనుక్కొని, ఫోన్ లోనే పరామర్శించాడట. అంతే కాదు, మెగా ఫ్యామిలీ తరుపున భారీ ఎత్తున ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం కూడా త్వరలోనే చేయబోతున్నారట.

    సుమారుగా 10 లక్షల రూపాయలకు పైగా ఆర్హిక సహాయం చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఆ కుటుంబానికి ఆర్థికంగా గా, మానసికంగా కానీ బలమైన సపోర్టు ఉండడం తప్పనిసరి , ఇలాంటి కష్టమైన సమయం లో తోడుగా ఉన్న మెగా ఫ్యామిలీ కి చేతులెత్తి మొక్కిన తక్కువ అవుతుందని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.