Homeఎంటర్టైన్మెంట్Manju Warrier: పబ్లిక్ లో హీరోయిన్ కి బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో...

Manju Warrier: పబ్లిక్ లో హీరోయిన్ కి బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్..

Manju Warrier: ఏమైందో ఏమో తెలియదు కానీ , గత ఏడాది నుండి సినీ అభిమానులు తాము అభిమానించే సెలబ్రిటీల విషయం లో విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లోకి సెలబ్రిటీలు వచ్చినప్పుడు వాళ్లపై ఎగబడడం వంటివి గత ఏడాది డిసెంబర్ నెల నుండి చూస్తున్నాం. ‘రాజాసాబ్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగాంగా ఒక సాంగ్ ఈవెంట్ కి ‘లుల్లూ మాల్’ కి విచ్చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ పై అభిమానులు ఏ రేంజ్ లో ఎగబడ్డారో మన కళ్లారా చూశాము. దీంతో నిధి అగర్వాల్ బట్టలు కూడా చిరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సమంత, అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి, శ్రీలీల , తమిళ హీరో విజయ్ వంటి వాళ్లకు కూడా పబ్లిక్ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలే రిపీట్ అయ్యాయి. ఇవంతా చూసిన తర్వాత అసలు ఏమైంది ఈమధ్య సినీ అభిమానులకు అనే సందేహం రాక తప్పదు.

రీసెంట్ గా మలయాళం హీరోయిన్ మంజు వారియర్ ఒక ఈవెంట్ కి వచ్చింది. అక్కడకు ఆమె రాగానే అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒక లేడీ అభిమాని అయితే ముందుకు దూసుకొచ్చి మంజు వారియర్ కి బలవంతంగా ముద్దు పెట్టేసింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన కారణంగా మంజు వారియర్ తో పాటు, అక్కడ ఉన్నవాళ్ళంతా షాక్ కి గురయ్యారు. ఒక్క నిమిషం వాళ్లకు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. తర్వాత ఆ అభిమానిని సెక్యూరిటీ సిబ్బంది పక్కకి తీసుకెళ్లగా , ఆ ఈవెంట్ కి హోస్ట్ వ్యహరిస్తున్న వ్యక్తి అక్కడికి వచ్చిన అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇలా సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టటడం సరికాదు, దయచేసి ప్రోటోకాల్ ని పాటించండి అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా మంజు వారియర్ నుండి ఎలాంటి ఫైర్ రియాక్షన్ రాలేదు. చాలా కూల్ గా వ్యవహరించింది.

సెల్ఫీలు అడిగితేనే చెంపలు పగలగొట్టే సినీ సెలబ్రిటీలు ఉన్న ఈ కాలం లో, ఒక అభిమాని మీదకు దూసుకొచ్చి ముద్దు పెట్టినప్పటికీ కూడా చిరాకు చూపించకుండా, చాలా కూల్ గా డీల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ విషయం లో మంజు వారియర్ ని మెచ్చుకొని తీరాల్సిందే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంజు వారియర్ విషయానికి ఈమె మలయాళం లో పెద్ద స్టార్ హీరోయిన్. తెలుగు లో ఇప్పటి వరకు ఈమె ఎలాంటి సినిమాలో నటించలేదు కానీ , ‘తూనీవు’ , ‘వెట్టియాన్’ వంటి చిత్రాల ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక తమిళ సినిమా, ఒక మలయాళం సినిమా, మరియు ఒక హిందీ సినిమా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Cinema scoop (@cs_review)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular