Mana Shankara Varaprasad Garu Collection: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) విడుదలైన రోజు నుండి నేటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ టిక్కెట్ల కోసం చేసిన యుద్ధాలను నేటి తరం ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. చిరంజీవి సినిమాకు సరైన టాక్ పడితే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అని ఆయన గురించి తెలియని నేటి తరం ఆడియన్స్ అందరికీ తెలిసేలా చేసింది ఈ చిత్రం. వారం రోజులు కూడా గడవకముందే 7 ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టింది ఈ చిత్రం. బయ్యర్స్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఆ రేంజ్ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ఈమధ్య కాలంలో ఇదే. ఈ రెండు సినిమాలకు అనిల్ రావిపూడి దర్శకుడు అవ్వడం గమనార్హం. ఇకపోతే ఆరు రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
నైజాం ప్రాంతం లో విడుదలకు ముందు ఈ చిత్రానికి 31 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. ఆరు రోజుల్లో దాదాపుగా 34.41 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి, బ్రేక్ ఈవెన్ మార్కును దాటి మూడు కోట్ల రూపాయిల లాభాలను రాబట్టింది. ఫుల్ రన్ ముగిసే సమయానికి 20 కోట్ల లాభాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే సీడెడ్ నుండి 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 13.33 కోట్లు, తూర్పు గోదావరి నుండి 10.20 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 7 కోట్లు , గుంటూరు జిల్లా నుండి 8.52 కోట్లు, కృష్ణ జిల్లా నుండి 8 కోట్లు, నెల్లూరు జిల్లా నుండి 4.68 కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా మొదటి ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 102 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర/ తెలంగాణ చూస్తే, కర్ణాటక + తమిళనాడు+ ఇతర రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 9 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఏకంగా 16 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 128 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 204 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఇదే రేంజ్ ఊపులో ముందుకుపోతే 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
