Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన చేసిన భద్ర సినిమా నుంచి రీసెంట్ గా చేసిన అఖండ 2 సినిమా వరకు 80% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్నాడు… కథ ఎలాంటిదైనా కూడా తన మేకింగ్ తో ఆ సినిమాకి కొత్త స్టైల్ ని ఏర్పాటు చేసే దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇప్పటివరకు అతను బాలయ్య బాబు తో సాలిడ్ సక్సెస్ ని సాధిస్తూ వచ్చాడు. వీళ్లిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు వస్తే అందులో మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. రీసెంట్గా వచ్చిన అఖండ 2 సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక అఖండ 2 సినిమా ప్లాప్ అవ్వడంతో బాలయ్య బాబు బోయపాటి శ్రీను మీద కొంతవరకు కోపంతో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే పర్ఫెక్ట్ సక్సెస్ ఫుల్ సినిమా నే వస్తుంది అంటూ చాలామంది నందమూరి అభిమానులు సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేసేవారు.
కానీ రీసెంట్ గా ఈ సినిమాతో ఫ్లాప్ రావడంతో వీళ్ళ కాంబినేషన్ కి కూడా బీటలు వారాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిన కూడా ఆ సినిమా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం అయితే ఇప్పుడు ఎవరికీ లేదు. ఇక బాలయ్య సైతం తను వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.
బోయపాటి చేసిన అఖండ 2 సినిమా భారీ ఫ్లాప్ అవ్వడంతో అతని సక్సెస్ లకు బ్రేక్ పడింది. దాంతో బాలయ్య కొంతవరకు బోయపాటి మీద కోపంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫుల్ సినిమా తీస్తే 100 మంది జై కొడుతారు. అలాగే కొంత మంది మన చుట్టూ చేరి సినిమా బాగా తీశారంటూ పొగుడుతుంటారు. కానీ ఒక సినిమా ఫెయిల్యూర్ సాధిస్తే మాత్రం హీరోలతో పాటు ప్రొడ్యూసర్లు కూడా ఆ దర్శకుడితో సినిమా చేసే అవకాశాన్ని ఇవ్వరు… మరి నెక్స్ట్ బోయపాటి ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
