Spirit Release Date: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగ…ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలతో గొప్ప ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కాబట్టి యూత్ ప్రేక్షకులు ఆయన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు..ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సైతం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రభాస్ పాన్ వరల్డ్ లో తన సత్తా చాటే అవకాశమైతే ఉంది. ఈ సినిమా రిలీజ్ ని సైతం సందీప్ రెడ్డి వంగ అనౌన్స్ చేశాడు.
మార్చి 27, 2027 వ సంవత్సరం లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక మార్చి 6వ తేదీన మహాశివరాత్రి పండుగ ఉంది. అలాగే 10 వ తేదీన రంజాన్ పండుగ ఉండడంతో ఆ వీక్ మొత్తం ఈ సినిమాకి బాగా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన రిలీజ్ డేట్ ని కన్ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డివంగా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతి షాట్ ను సైతం చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కించే ప్రయత్నంలో తను ఉన్నాడు. అందుకే ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాననే కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు…
ఇక సందీప్ రెడ్డివంగ డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కినవే కావడం విశేషం…ఇక స్పిరిట్ సినిమాలో సైతం అలాంటి కంటెంట్ తో ఉన్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ప్రేక్షకులందరు సాఫీగా చూడదగిన సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది… చూడాలి మరి స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అనేది…
