Honda Activa 7G: రోజువారి అవసరాలకు ఒకప్పుడు ద్విచక్ర వాహనాల కోసం బైక్స్ కొనేవారు. కానీ ఇప్పుడు ఆకర్షణీయమైన స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యాపారులకు తమ సరుకులు తీసుకురావడానికి అనుగుణంగా ఉండే ఈ స్కూటర్ మోడల్ ముందుగా హోండా కంపెనీ నుంచి యాక్టివా మార్కెట్లోకి రాబోతుంది. అయితే ఇప్పుడు మిగతా కంపెనీలు సైతం పోటీపడి ఇవే స్కూటర్లను తీసుకొస్తున్నాయి. అయితే వీరికి పోటీగా హోండా సరికొత్తగా Activa 7G స్కూటర్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని ఆసక్తి చెబుతున్నారు. అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్స్ ఇందులో సెట్ చేశారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Honda Activa 7G త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఇది వినియోగదారులను ఆకర్షించే విధంగా డిజైన్ కొత్తగా తయారు చేశారు. స్కూటర్ ముందరి భాగంలో హెడ్ లాంప్స్ స్మార్ట్ గా ఉంటాయి. ఇవి LED లైట్స్ కావడంతో ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే DRL హెడ్ లాంప్స్ కూడా సౌకర్యవంతంగా ఉండనున్నాయి. వీటితోపాటు టెయిల్ లైట్స్ కూడా కొత్తగా ఉండడంతో స్కూటర్కు అందాన్ని తీసుకువచ్చాయి. ఈ మోడల్ పలు రకాలుగా ఉండడంతో పాటు కొత్త కలర్లలో మార్కెట్లోకి వచ్చింది.
ఈ మోడల్ ఇండియన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 110 సిసి రిఫైండ్ ఇంజన్ ను అమర్చారు. ఇది ఎయిర్ కోల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ తో కూడుకొని ఉంది. ఈ ఇంజన్ లీడర్ ఇంధనానికి 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం ఉంది. రోజువారి వినియోగదారులతోపాటు కార్యాలయాలు, వ్యాపారస్తులకు అనుగుణంగా మైలేజ్ ఇవ్వడం ఉంది. ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఈ కొత్త స్కూటర్ లో లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లను అమర్చారు. డిజిటల్ TFT క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ కి ఆప్షన్ వంటివి అందాన్ని తీసుకొస్తాయి. అలాగే టెలిస్కోపిక్ ఫ్రంటు ఫోర్క్స్, అడ్జస్టేబుల్ రియాజ్ సస్పెన్షన్, పోర్టల్ ఫ్రంటు డిస్క్ బ్రేక్ వంటివి సేఫ్టీని ఇస్తాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ సేఫ్టీ ఫీచర్ కూడా రక్షణను ఇస్తాయి.
కొత్తగా బైక్ కొనాలని అనుకునే వారితోపాటు.. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండేలా దీనిని డిజైన్ చేశారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ.80,000 నుంచి రూ.90,000 వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 అక్టోబర్ లోపు ఇది మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్టైలిష్ డిజైన్ తో పాటు మైలేజ్ ఎక్కువగా కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది అని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.
