Mana Shankara Vara Prasad Garu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించారు. ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా మెగాస్టార్ చిరంజీవిని బీట్ చేసే హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది వాస్తవం… గత 50 సంవత్సరాల నుంచి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ డాన్సులు, ఫైట్లు చేస్తూ ప్రేక్షకులందరిని అలరించడంలో అతను సూపర్ సక్సెస్ అవుతున్నాడు…
మన శంకర్ వరప్రసాద్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ సినిమా దర్శకుడు అయిన అనిల్ రావిపూడి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా సక్సెస్ అయినందుకు సంతోషిస్తున్నాను అని చెప్పడమే కాకుండా సినిమా ఫస్ట్ స్క్రీన్ ప్లే ఆర్డర్ వేరేలా ఉందని చెప్పాడు.
మొదట హీరో హీరోయిన్ విడిపోయిన దగ్గర నుంచి స్క్రీన్ ప్లే ఆర్డర్ వేశామని ఆ తర్వాత వాళ్ళ లవ్ ట్రాక్ వస్తుందని చెప్పాడు. అలా వస్తే వీళ్ళ లవ్ ట్రాక్ ఎలివేట్ అవ్వడం లేదని తన వల్ల సినిమా మొత్తానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఎడిట్ టేబుల్ మీద స్క్రీన్ ప్లే ఆర్డర్ ని మార్చేసాము అంటూ ఆయన తన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మెగా అభిమానులు అలాగే అనిల్ రావిపూడి ఫ్యాన్స్ సైతం ఈ ఆర్డర్ బాగుంది. ముందనుకున్న ఆర్డర్లో కనక సినిమాని చేసి ఉంటే సినిమా డిజాస్టర్ అయ్యుండేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి ఈ సంక్రాంతి విన్నర్ గా చిరంజీవిని నిలపడం అనేది మామూలు విషయం కాదు…
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయాన్ని మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచన ఉన్నాడు…
