Tollywood Senior Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు డిఫరెంట్ సబ్జెక్ట్ లతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించాలని చూస్తుంటారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేసిన కూడా వాళ్ళు అనుకున్న సక్సెస్ లను సాధించలేక పోతారు. కారణం ఏదైనా కూడా వాళ్లతో సినిమాలు చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ఇద్దరు సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం చాలా కష్టమని చాలా మంది చెబుతూ ఉంటారు.
వాళ్ళలో ఒకరు చిరంజీవి… ఆయన సినిమా విషయంలో చాలా క్లారిటీ గా ఉంటాడు. ఆయన ప్రతి విషయంలో దర్శకుడు క్లారిటిగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఒకవేళ దర్శకుడు క్లారిటి గా లేకపోతే మాత్రం అర్ధాంతరంగా షూటింగ్ నిలిపి వేస్తాడు. మనం చేయాలనుకున్నది ఏంటి అనేది దర్శకుడితో మాట్లాడి క్లారిటి గా తెలుసుకుంటాడట.
అతనికి క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే చిరంజీవి దాన్ని సాఫీగా షూటింగ్ చేస్తు ముందుకు తీసుకెళ్తాడు. లేకపోతే చిరంజీవి కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి దర్శకుడులో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు… నాగార్జున సైతం దర్శకుడు క్లారిటి గా లేకపోతే ఆయన అసలు ఒప్పుకోడు. ప్రతి విషయాన్ని తనే అడిగి తెలుసుకుంటాడు. ప్రతి సన్నివేశాన్ని ఎలా తీయాలనుకుంటున్నారు అనేది కూడా దర్శకుడి దగ్గర నుంచి ఒక క్లారిటీ తీసుకుంటాడు. మొత్తానికైతే ఈ ఇద్దరు సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం చాలా కష్టమని వాళ్లతో పని చేసిన చాలా మంది చెబుతుంటారు.
దర్శకుడు క్లారిటీగా ఉంటే మాత్రం వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టారట. ఒకవేళ సినిమా విషయంలో దర్శకుడు అనుకున్న విజన్ పర్ఫెక్ట్ గా లేకపోతేనే వాళ్ళు ఇన్వాల్వ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మరి కొంతమంది చెబుతున్నారు. మొత్తానికైతే ఇద్దరు సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం చాలా కష్టమని మరి కొంతమంది చెబుతుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న దర్శకులందరు క్లారిటిని మైంటైన్ చేస్తూనే వస్తున్నారు… లేకపోతే మాత్రం భారీ ప్లాప్ లను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు…
