https://oktelugu.com/

బాలుడు దీక్షిత్ కిడ్నాప్‌ కథ విషాదాంతం

నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్‌లో కిడ్నాప్‌ అయిన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ కథ విషాదంగా ముగిసింది. గత ఆదివారం దీక్షిత్‌ను దుండగులు కిడ్నాప్ చేయగా.. బాలుడిని అప్పగించాలంటే వారు రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లకు డబ్బు ఇచ్చేందుకు దీక్షిత్ తండ్రి తెలిసినవారి వద్ద అప్పులు కూడా చేశాడు. ఆ డబ్బుల బ్యాగుతో కిడ్నాపర్లు రమ్మన్న చోటికి వెళ్లేందుకు సైతం సిద్ధపడ్డాడు. కానీ.. ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆ దుండగులు బాలుడ్ని హత్య […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 2:40 pm
    Follow us on

    నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్‌లో కిడ్నాప్‌ అయిన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ కథ విషాదంగా ముగిసింది. గత ఆదివారం దీక్షిత్‌ను దుండగులు కిడ్నాప్ చేయగా.. బాలుడిని అప్పగించాలంటే వారు రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లకు డబ్బు ఇచ్చేందుకు దీక్షిత్ తండ్రి తెలిసినవారి వద్ద అప్పులు కూడా చేశాడు. ఆ డబ్బుల బ్యాగుతో కిడ్నాపర్లు రమ్మన్న చోటికి వెళ్లేందుకు సైతం సిద్ధపడ్డాడు. కానీ.. ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆ దుండగులు బాలుడ్ని హత్య చేయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలుడి శవాన్ని మహబూబాబాద్ శివారులో స్థానికులు గుర్తించారు.

    Also Read: ఏంటి బాబూ విడ్డూరం: హద్దు రాళ్లను వదలని జగన్?

    దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 18న ఆడుకుంటుండగా దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేశారు. ఈజీ లైఫ్‌కు అలవాటుపడిన కిడ్నాపర్లు ఈ పని చేశారు. కిడ్నాపర్‌ సాగర్‌ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. కిడ్నాప్‌ చేసిన గంటలోనే బాలుడిని చంపేశారని ఎస్పీ వెల్లడించారు. తొందరగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతోనే కిడ్నాప్ చేశారని వెల్లడించారు. డబ్బులు డిమాండ్‌ చేశాక దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్‌ను చంపారని తేల్చారు. బాలుడిని తీసుకెళ్తున్న సీసీ ఫుటేజీ కూడా దొరికిందన్నారు. బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు ముందుగానే రెక్కీ నిర్వహించారన్నారు.

    దీక్షిత్‌ కిడ్నాప్‌ విషయంలో 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. గంటలోనే బాలుడిని గొంతునులిమి చంపారని ఎస్పీ వెల్లడించారు. బాలుడిని విడిచిపెట్టేందుకు రూ.45 లక్షలు డిమాండ్‌ చేయగా.. కిడ్నాప్‌, హత్య చేసింది మంద సాగర్‌ ఒక్కడేనని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. యాప్‌ ద్వారా బాలుడి తండ్రికి కిడ్నాపర్‌ ఫోన్‌ చేశాడు. ఎవరో తెలిసిన వ్యక్తే ఆ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానించగా.. ఆ తెలిసిన వ్యక్తి కావడం వల్లే సాగర్‌తో బాలుడు వెళ్లాడన్నారు. కిడ్నాప్‌పై పూర్తి సమాచారం రావాల్సి ఉందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి కిడ్నాపర్‌ను పట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

    Also Read: ఉల్లిగడ్డ భారం: తెలుగు రాష్ట్రాల ‘ఉల్లి’ కన్నీరు

    ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారిలో ఇద్దరు బాలుడికి సమీప బంధువులేనని సమాచారం. మరో ఇద్దరు బయటి వ్యక్తులుగా తెలుస్తోంది. కాగా.. దీక్షిత్‌ని హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది.