Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. తండ్రికి తగ్గ తనయుడు గా నిలిచాడు. ఆయన లాంటి హీరో ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేంతలలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మహేష్ బాబు పక్కన నటించడానికి చాలామంది హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం అతన్ని బెదిరించిందట. షూటింగ్ చేసేటప్పుడు తనను ఎలా పట్టుకోవాలి ఎలా పట్టుకోకూడదు అనేది ఆ హీరోయిన్ చెప్పేదట. ఇక మహేష్ బాబు తను పడిపోతుంటే పట్టుకోబోతుంటే కూడా ఎందుకు పట్టుకున్నవని బెదిరించిందట. ఇంతకీ ఆమె ఎవరు అంటే నమ్రత కావడం విశేషం… వంశీ సినిమా సమయంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి ముందు ఈ ఫన్నీ కన్వర్జేషన్ అంతా జరిగిందట.
ఆమె అలాంటి మాటలు మాట్లాడినా కూడా మహేష్ బాబు కి పెద్దగా కోపం వచ్చేది కాదట. ఎందుకంటే మహేష్ బాబు ఆమె ను అంతకు ముందు నుంచే లవ్ చేస్తుండటం వల్లే ఆమె ఏం మాట్లాడినా కూడా మహేష్ బాబుకి చాలా బాగా అనిపించేదట. మొత్తానికైతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుంటే నమ్రత మాత్రం బిజినెస్ ను, పిల్లల బాధ్యతను తనే చూసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… మహేష్ బాబు ప్రస్తుతం ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి తొందర్లోనే ఆయన విభిన్న సినిమాలను చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…
1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి సినిమా లాంగ్ రన్ లో 3500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతోందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు. ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
