తెలంగాణలోని మినీ ఇండియా గ్రామం గురించి మీకు తెలుసా..?

ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఆ ఆచారాలు, సాంప్రదాయాలే ఆ దేశానికి ఆ ప్రాంతానికి ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. అయితే ఒకే గ్రామంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులను పాటించే ప్రజలు ఉండటం చాలా అరుదు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ పేట జిల్లా లోని ఒక గ్రామం మాత్రం ఆ అరుదైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. మినీ ఇండియాగా పిలవబడే ఆ గ్రామంలోని ప్రజలంతా ఇతర ప్రాంతాల నుంచి, […]

Written By: Navya, Updated On : October 8, 2020 5:00 pm
Follow us on

ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఆ ఆచారాలు, సాంప్రదాయాలే ఆ దేశానికి ఆ ప్రాంతానికి ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. అయితే ఒకే గ్రామంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులను పాటించే ప్రజలు ఉండటం చాలా అరుదు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ పేట జిల్లా లోని ఒక గ్రామం మాత్రం ఆ అరుదైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

మినీ ఇండియాగా పిలవబడే ఆ గ్రామంలోని ప్రజలంతా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాలను నుంచి అక్కడికి వలస వచ్చే వాళ్లే కావడం గమనార్హం. దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్న రోజుల్లో అప్పటి సర్కార్ పాలమూరు – కర్ణాటక సరిహద్దుల్లో ఒక వంతెనను కృష్ణా నదిపై నిర్మించింది. ఈ వంతెన నిర్మించిన ప్రాంతం దగ్గర ప్రజలు, ఇళ్లు లేవు. ఆ తరువాత అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడంతో కొందరు రైల్వే ఉద్యోగులు అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు.

అలా రైల్వే ఉద్యోగులుగా పని చేస్తున్న వాళ్లలో వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉండేవారు. కొందరు అక్కడే ఉద్యోగం రిటైరై అక్కడే స్థిర నివాసాలను ఏర్పరచుకున్నారు. అలా ఏ పేరు లేని ఆ గ్రామం కృష్ణ గ్రామంగా మారి భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు నెలవైంది. దీంతో ఆ గ్రామాన్ని అక్కడి ప్రజలు మినీ ఇండియా అనే పేరుతో పిలుచుకునేవారు. వందేళ్ల క్రితం కొందరు బ్రాహ్మణులను అక్కడ ప్రతిష్టించిన శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం కోసం నియమించారు.

ప్రస్తుతం వారి సంతానం పూజలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కర్మాకాండలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని రెండో కాశీ అని కూడా కొందరు పిలుస్తారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చిన తరువాత జైనులు, రాజ్ పుత్ లు, ముస్లింలు, అగర్వాల్స్ కూడా వచ్చి స్థిర్పడటంతో కృష్ణ గ్రామం మినీ ఇండియాగా ప్రసిద్ధికెక్కింది.