Homeఎంటర్టైన్మెంట్Maa Inti Bangaram First Week Collections: 'మా ఇంటి బంగారం' మొదటి వారం వరల్డ్...

Maa Inti Bangaram First Week Collections: ‘మా ఇంటి బంగారం’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. పెట్టిన డబ్బులకు పదింతలు లాభాలు..

Maa Inti Bangaram First Week Collections: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటోంది. విడుదలైన రెండవ రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సినిమాగా టాలీవుడ్ లో ఈ చిత్రం అరుదైన రికార్డు ని నెలకొల్పి సంచలనం నమోదు చేసింది. రెండవ రోజు నుండి లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా , ఇప్పుడు అన్ని విధాలుగా బయ్యర్స్ కి బంగారు బాతు లాగా మారిపోయింది. మొదటి వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం కనబరుస్తున్న హోల్డ్ ని చూస్తుంటే , ఇప్పట్లో కలెక్షన్స్ ఆగేలా లేవు. వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు 6 వ రోజున 1 కోటి 8 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే , 7 వ రోజున 1 కోటి 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఈ సినిమాకు మొదటి వారం లో 15 కోట్ల 14 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 29 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో నైజాం ప్రాంతం నుండి 8 కోట్ల 58 లక్షల రూపాయిలు రాగా , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 6 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర/ తెలంగాణ విషయానికి వస్తే , తమిళనాడు నుండి 1 కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 40 లక్షలు వచ్చాయి.

ఇక ఓవర్సీస్ ప్రాంతం నుండి అయితే ఏకంగా 8 కోట్ల 25 లక్షలు వచ్చాయి. ఈ వీకెండ్ తో నైజాం మరియు ఓవర్సీస్ మార్కెట్స్ లో చెరో 10 కోట్ల షేర్ వసూళ్ల మార్కు ని దాటనుంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 28 కోట్ల 9 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు కేవలం 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం , విడుదల తర్వాత ఏకంగా 16 కోట్ల రూపాయలకు పైగా లాభాలను సొంతం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఇది 30 కోట్ల లాభాలకు ఎగబాకిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular