Rashmika Mandanna: పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందాన. కన్నడ సినీ ఇండస్ట్రీ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె , ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి , వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగి , ఇక్కడొచ్చిన ఫేమ్ తో బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు సంపాదించి , నేడు పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చలామణి అవుతున్న ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం , అభినయం రెండు ఉన్న హీరోయిన్స్ మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో చాలా అరుదుగా దొరుకుతుంటారు. ఆ అరుదైన వారిలో రష్మిక మందాన కూడా ఒకరు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
తన తోటి నటీనటులతో చాలా ఫ్రెండ్లీ గా ఉండే రష్మిక , షూటింగ్ సెట్స్ లో ఒక స్టార్ హీరో చెంప పగలగొట్టింది అంటే నమ్ముతారా?, కానీ నిజంగానే ఆమె కొట్టింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే గతం లో యాంకర్ ప్రదీప్ పాపులర్ గేమ్ షో ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ టాక్ షోలో పాల్గొన్నప్పుడు చెప్పుకొచ్చింది. ప్రదీప్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ జీవితం లో ఎవరి మీదైనా చెయ్యి చేసుకున్నారా?’ అని అడగ్గా, అందుకు రష్మిక ‘అవును , షూటింగ్ సెట్స్ లోనే ‘ అని అంటుంది. అప్పుడు ప్రదీప్ ‘అవునా, అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే’ అని అడగ్గా, రష్మిక అందుకు సమాధానం చెప్తూ ‘ఒక సన్నివేశం షూటింగ్ లో స్టార్ హీరో చెంప పగలగొట్టాల్సి వచ్చింది. వాస్తవానికి యాక్ట్ చెయ్యాలి , కానీ నాకు ఫ్లో లో వచ్చేసింది, దెబ్బ గట్టిగా తగలడం తో నేను చాలా ఫీల్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే రష్మిక సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి ‘రణబలి ‘ అనే చిత్రం లో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తో పాటు ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న రష్మిక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాకా’ లో విలన్ క్యారెక్టర్ చేస్తోంది, ఇలా వరుసగా క్రేజీ ఆఫర్స్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో దూసుకెళ్తోంది రష్మిక.
