Kumari Aunty : కుమారీ ఆంటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పేరు. ఈమె వంటలతో చాలా ఫేమస్ అయింది. చుట్టుపక్కల ఉన్న వారు మాత్రమే కాదు. ఈమె వంటల గురించి తెలిసిన చాలా మంది ఆ ప్రాంతాన్ని వెతికి మరీ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నారు. ఫుట్ పాత్ పక్కన ఫుడ్ స్టాల్ పెట్టి తన బిజినెస్ ను విస్తరిస్తూ.. మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంది కుమారీ ఆంటీ. అన్నంలో టేస్ట్.. కుమారి ఆంటీ మాటల్లో ఆప్యాయత అంటూ కామెంట్లు చేస్తుంటారు కొందరు.
ఈమె మాట తీరును అనుసరిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయింది. అంతేకాదు యూట్యూబ్ ఛానల్స్ వారు వెళ్లి ఇంటర్వ్యూ చేయడంతో మరింత ఫేమస్ అయింది. ఇక ఫుడ్ స్టాల్ వద్దకు చేరుకొని ఆమె ధరలు ఏంటి? ఎలా చేస్తుంది? ఎంత సంపాదిస్తుంది వంటివి వివరాలు అన్నీ సేకరించి మరీ ఆడియన్స్ ముందు పెట్టేవారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది కుమారీ ఆంటి. కానీ ఇదే పాపులారిటీ ఆమె బిజినెస్ క్లోజ్ చేసేవరకు వచ్చింది.
ఈమె దగ్గర ఫుడ్ తినడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చేవారు. దీంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేది. దీంతో పోలీసులు ఫుడ్ స్టాల్ క్లోజ్ చేయించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తిరిగి యధావిధిగా తన ఫుడ్ స్టాల్ ను ప్రారంభించింది. ఇలా ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ మంచి సక్సెస్ అందుకున్న ఈమె తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు బిగ్ బాస్ లోకి, శ్రీదేవి డ్రామా కంపెనీలోకి రాబోతుందంటూ వార్తలు వచ్చాయి.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీ కి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో మీకు ఎలా తెలుస్తాయి అంటూ నవ్వింది. అయితే నిజం చెప్పండి. మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్లి ఏం చేస్తారు అంటూ ప్రశ్నలు అడగగా.. అవన్నీ అడగకండి అంటూ సమాధానం చెప్పింది. దీంతో ఆమె త్వరలోనే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్లబోతుంది అంటూ స్పష్టంగా అర్థం అవుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఫుడ్ బిజినెస్ ద్వారా ఈ రేంజ్ లో పాపులారిటీ సంపాదించడం గ్రేట్ అంటున్నారు నెటిజన్లు.