Kriti Sanon: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నేటి తరం హీరోయిన్స్ లో ఒకరు కృతి సనన్. ఈమె వెండితెరకు ‘1 నేనొక్కడినే’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ, చూసేందుకు అందంగా ఉండడంతో పాటు , నటన కూడా అద్భుతంగా ఉండడంతో అవకాశాలు క్యూలు కట్టాయి. ఈ చిత్రం తర్వాత ఆమె అక్కినేని నాగ చైతన్య తో కలిసి చేసిన ‘దోచేయ్’ చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ , మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఒక స్టార్ హీరో కి ఎలాంటి స్టార్ డమ్ ఉంటుందో , ఈమెకు కూడా అదే రేంజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘మిమీ ‘ చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గానూ , ఆమె ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇలా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న కృతి సనన్ , తన చిరకాల కోరికని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది. తనకు పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్ చెయ్యాలని ఉందని , ఒక సైకో లాగా నటించాలని ఎంతో కోరికగా ఉందని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు నిజ జీవితానికి భిన్నంగా ఉండే పాత్రలు చెయ్యాలని ఉంది. హాలీవుడ్ లో రీసెంట్ గానే సూపర్ హిట్ గా నిల్చిన ‘అబ్సెషన్’ ని చూసాక , ఎలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలో ఒక అవగాహన వచ్చింది. నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఇక నుండి సేఫ్ గేమ్స్ ఆడడం మానేసి, సరికొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఒక సైకో అమ్మాయి పాత్రలో నటించాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్.
ఒక నటిగా మనకు సంబంధం లేని వ్యక్తిత్వాన్ని వెండితెర పై ఆవిష్కరించి , వారి జీవితాన్ని జీవించడం లో వచ్చే కిక్ మామూలుగా ఉండదు అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్. రీసెంట్ గానే ఆమె ‘కాక్ టైల్ 2’ అనే చిత్రం లో నటించింది. షాహిద్ కపూర్ , రష్మిక మందాన హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం లో కృతి సనన్ కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. ఒకవిధంగా చెప్పాలంటే ఆ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కృతి సన నటనే అంటూ విమర్శకులు సైతం ప్రశంసించారు. కాసేపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తేనే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది , ఇక పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్ లో కనిపిస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మీరే ఊహించుకోండి.
