Prabhas Kriti Sanon : కృతి సనన్ కు ప్రభాస్ లవ్ ప్రపోజ్ చేశాడు: సంచలన నిజాలు చెప్పిన ఉమైర్ సంధూ

Prabhas Kriti Sanon :  దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓ న్యూస్ ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్.. ప్రభాస్-కృతి సనన్ ఎఫైర్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ప్రభాస్ మరోసారి ఎఫైర్, పెళ్లి రూమర్స్ ఎదుర్కొంటున్నారు. ప్రభాస్ మనసులో కృతి సనన్ ఉన్నారని వరుణ్ ధావన్ పరోక్షంగా చెప్పాడు. విషయంలోకి వెళితే… కృతి సనన్-వరుణ్ ధావన్ జంటగా బేడియా టైటిల్ తో హారర్ మూవీ విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని […]

Written By: NARESH, Updated On : నవంబర్ 29, 2022 7:20 సా.
Follow us on

Prabhas Kriti Sanon :  దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓ న్యూస్ ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్.. ప్రభాస్-కృతి సనన్ ఎఫైర్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ప్రభాస్ మరోసారి ఎఫైర్, పెళ్లి రూమర్స్ ఎదుర్కొంటున్నారు. ప్రభాస్ మనసులో కృతి సనన్ ఉన్నారని వరుణ్ ధావన్ పరోక్షంగా చెప్పాడు. విషయంలోకి వెళితే… కృతి సనన్-వరుణ్ ధావన్ జంటగా బేడియా టైటిల్ తో హారర్ మూవీ విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని తోడేలు గా విడుదల చేశారు. తోడేలు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్-కృతి ఒక రియాలిటీ షోలో పాల్గొన్నారు.

ఈ షో యాంకర్ గా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఉన్నారు. ఆయన వరుణ్ ని ఒక ప్రశ్న అడిగారు. *నీ గుండెల్లో కృతిసనన్ పేరు ఎందుకు లేదు?@ అని ప్రశ్నించారు. దానికి వరుణ్, ‘కారణం ఏమిటంటే మరొకరి మనసులో కృతి పేరు ఉంది. ఆయన ముంబైలో లేడు. మరొక చోట దీపికా పదుకొనెతో పాటు షూటింగ్ చేస్తున్నాడు’ అని చెప్పాడు. వరుణ్ కామెంట్ కి కృతితో పాటు వేదికపై ఉన్నవారు షాక్ కి గురయ్యారు. ఇక్కడ వరుణ్ ప్రభాస్ గురించే చెప్పాడని క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రాజెక్ట్ కే షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనె అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వరుణ్ ఇచ్చిన హింట్ ఖచ్చితంగా ప్రభాస్ గురించే. దీంతో ప్రభాస్-కృతి సనన్ ప్రేమించుకుంటున్నారని వరుణ్ స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది.

ప్రభాస్-కృతి బంధంపై తాజాగా ప్రముఖ రివ్యూయర్, క్రిటిక్ అయిన ఉమైర్ సంధూ కూడా ట్వీట్ చేయడంతో ఈ విషయం నిజమేనని అనిపిస్తోంది. ఉమైర్ సంధూ నిత్యం పలు సినిమాలపై సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తుంటాడు. తాజాగా ప్రభాస్-కృతి బంధంపై కూడా ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

‘అధికారికంగా చెబుతున్నాను.. ఆదిపురుష్ షూటింగ్ లో కృతిసనన్ కు ప్రభాస్ యే లవ్ ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే నిశ్చితార్థం’ అంటూ రెండు హార్ట్ ఎమోజీలను షేర్ చేశాడు. దీంతో అది చూసి నెటిజన్లు,ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవర్ గ్రీన్ బ్యాచ్ లర్ ప్రభాస్ పెళ్లి కోసం ఆయన కుటుంబమే కాదు.. అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అనుష్కతో గతంలో పెళ్లి వార్తలు వచ్చినా సాధ్యం కాలేదు. ఇప్పుడు కృతిసనన్ తో అయినా ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కాలని అందరూ కోరుకుంటున్నారు.

ఇక 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ప్రభాస్ ఒంటరిగా ఉంటున్నాడు. అతడి పెళ్లి కోసం అందరూ ఎదురుచూస్తున్న వేళ ఈ వార్త బయటకు రావడంతో అందరూ ఈ జంట పెళ్లి పీటపీటలెక్కాలని యోచిస్తున్నారు.

https://twitter.com/UmairSandu/status/1597127257977683968?t=NeernWTNVNpwUTilQphTqw&s=08