https://oktelugu.com/

Mahesh – Namratha : నమ్రత అలాంటి అమ్మాయనే మహేష్ భార్యగా కృష్ణ ఒప్పుకోలేదా? అప్పుడు ఏం జరిగింది?

నమ్రతను కోడలిగా కృష్ణ అంగీకరించలేదట. పెళ్లి జరగడానికి వీల్లేదని గట్టిగా చెప్పారట. నమ్రతను కృష్ణ తిరస్కరించడానికి బలమైన కారణమే ఉందట.

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2023 / 08:08 PM IST

    Mahesh Family

    Follow us on

    Mahesh – Namratha : మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల వివాహం అప్పట్లో ఓ సెన్సేషన్. కారణం, వీరి ఎఫైర్ గురించి మీడియాకు కూడా తెలియదు. ఎలాంటి వార్తలు రాలేదు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. ఐదేళ్లకు పైగా ప్రేమించుకున్నా మహేష్, నమ్రతల రిలేషన్ బయటకు పొక్కలేదు. 2005లో మహేష్-నమ్రతల వివాహం అత్యంత నిరాడంబరంగా ముగిసింది. వార్తా పత్రికలో మహేష్ పెళ్లి వార్త చదివి జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందరో అమ్మాయిల హార్ట్ బ్రేక్ అయ్యింది. కలల రాకుమారుడిగా మహేష్ కి ఫుల్ గా లేడీ ఫాలోయింగ్ ఉండేది.

    అయితే మహేష్ నిరాడంబరంగా వివాహం చేసుకోవడానికి కారణం తండ్రి కృష్ణ పెళ్ళికి ఒప్పుకోకపోవడమే అని ప్రచారం జరిగింది. నమ్రతను కోడలిగా కృష్ణ అంగీకరించలేదట. పెళ్లి జరగడానికి వీల్లేదని గట్టిగా చెప్పారట. నమ్రతను కృష్ణ తిరస్కరించడానికి బలమైన కారణమే ఉందట. నమ్రత అప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఆమె నార్త్, మనం సౌత్. ఇక బాలీవుడ్ కల్చర్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఎఫైర్స్, మ్యారేజెస్ వెరీ కామన్. ఏమాత్రం తేడా వచ్చినా విడాకులు అంటారు.

    అలాంటి వాతావరణంలో పెరిగిన అమ్మాయి తెలుగింటి కోడలుగా ఇమడదు. మన పరిస్థితులకు, పద్ధతులకు లోబడి నడుచుకోవడం కల్ల. పెళ్లి తర్వాత సమస్యలు రావచ్చు. అందుకే మహేష్ కి నచ్చజెప్పి పెళ్లి ఆపాలని చూశాడట. అయితే మహేష్ నిర్ణయానికి తల్లి ఇందిరా దేవి, అక్క మంజుల మద్దతు ఇచ్చారట. నమ్రత మంచి అమ్మాయి, మహేష్ లైఫ్ బాగుంటుందని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేశారట. అయిష్టంగానే కృష్ణ కొడుకు పెళ్లి చేశాడట. అయితే పెళ్లయ్యాక ఆయన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందట.

    నమ్రత సినిమాలు మానేసి గృహిణిగా మారిపోయారు. వీలైనంత త్వరగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. గౌతమ్, సితారలకు జన్మనిచ్చారు. పెద్దయ్యే వరకు నమ్రత పిల్లల పోషణ చూసుకున్నారు. కొన్నాళ్లుగా మహేష్ కెరీర్ మీద, వ్యాపారాల మీద దృష్టి పెట్టారు. మహేష్ కి నమ్రత అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మహేష్ స్టార్ గా ఎదగడంలో నమ్రత తన వంతు పాత్ర పోషించారు. విశేషం ఏమిటంటే మహేష్ కంటే నమ్రత నాలుగేళ్లు పెద్దది. మహేష్ కి భార్య కాకముందే అక్క మంజులతో నమ్రత స్నేహం చేశారట.