సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కథలో రాజకుమారి టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ అన్న సంగతులు బయటపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆమెను సూత్రధారి అని.. తన తండ్రి భూమా నాగిరెడ్డి నుంచి భూమిని కొన్న ప్రవీణ్ రావు సహా ఇద్దరు సోదరుల కిడ్నాప్ కేసులో ఈమెను కీలక పాత్ర పోషించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అందుకే అఖిలప్రియను ఏ1గా పోలీసులు మార్చినట్టు తెలిసింది.
Also Read: జగన్‌ను మెచ్చుకున్న సోము
అఖిలప్రియ ప్లాన్ చేస్తే భార్గవ్ రామ్ టేకప్ చేస్తే అమలు చేసేది మాడాల శ్రీను అనే వీరి ప్రధాన అనుచరుడు అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. భార్గవ్ రామ్ వేసిన కిడ్నాప్ ప్లాన్ ను మాడాల శ్రీను దగ్గరుండి అమలు చేశాడని అనుమానిస్తున్నారు. ఆరు నెలల కిందటే ఈ స్కెచ్ వేశారని.. పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. రెక్కీ నిర్వహించిన ప్రతిసారి సీసీటీవీల కంటపడకుండా ఉండడానికి ప్రతీ వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్లను అమర్చినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు ఇప్పుడు ఆరాతీస్తున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో మాడాల శ్రీను ప్రధాన అనుచరుడిగా భూమా అఖిలప్రియకు ఉన్నారని సమాచారం. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా అఖిలప్రియ తరుఫున అన్నీ తానై మాడాల శ్రీను వ్యవహరించాడని కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.
Also Read: సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోడీ సార్? న్యాయమా?
ఇక ఈ కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ముందుగా బెంగళూరుకు వెళ్లిన భార్గవ్ రామ్ ఇప్పుడు అక్కడి నుంచి మైసూర్ కు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసుల బృందం మైసూరుకు వెళ్లినట్లు తెలిసింది.అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మైసూర్ లో అతడు తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో నాలుగు బృందాలు విడిపోయి అతడి కోసం జల్లెడ పడుతున్నాయి.
ఇక అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటనేది ఉత్కంఠగా మారింది. అఖిలప్రియ గర్భవతి కాదని.. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరుపనుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్