Jr NTR-Prashanth Neel : విలన్ గా జూనియర్ ఎన్టీఆర్.. హీరో ఎవరో తెలుసా? షేక్ అవుతున్న టాలీవుడ్!

Jr NTR -Prashanth Neel : ‘కేజీఎఫ్’తో దేశాన్ని షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ రెండు చిత్రాలు ప్యాన్ ఇండియా లెవల్ లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ‘ప్రభాస్’తో ‘సలార్’ తీస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా ‘సలార్’ తర్వాత పట్టాలెక్కనుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘కొరటాల శివ’ దర్శకత్వంలో మూవీకి కమిట్ […]

Written By: NARESH, Updated On : September 26, 2022 5:26 pm
Follow us on

Jr NTR -Prashanth Neel : ‘కేజీఎఫ్’తో దేశాన్ని షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ రెండు చిత్రాలు ప్యాన్ ఇండియా లెవల్ లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ‘ప్రభాస్’తో ‘సలార్’ తీస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా ‘సలార్’ తర్వాత పట్టాలెక్కనుంది.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘కొరటాల శివ’ దర్శకత్వంలో మూవీకి కమిట్ అయ్యాడు. ‘ఆచార్క్ష్’ ఫ్లాప్ తో అప్పుల పాలైన కొరటాల ఆ సినిమా కోసం ఆస్తులు అమ్మి మరీ సెటిల్ చేసినట్టు టాక్. ఆ గొడవల్లో పడి ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం చేస్తున్నాడు.

ఎన్టీఆర్ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఓ అద్భుతమైన న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ఎన్టీఆర్ భారీ మీసాలతో బ్లాక్ అండ్ వైట్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నాడు. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుముందే ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రం పీరియాడికల్ డ్రామా అని.. ఇందులో హీరో, విలన్ రెండూ ఎన్టీఆరేనని టాక్. ఇదే నిజమైతే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఎందుకంటే ఇదివరకే ఎన్టీఆర్ ‘జైలవకుశ’ చిత్రంలో విలన్ గా నటించాడు. అందులో త్రిపాత్రాభినయం చేసి అభిమానులను మెస్మరైజ్ చేశాడు. ఆ సినిమాలో హీరోపాత్ర కంటే కూడా ‘విలన్’ పాత్ర అయిన ‘రావణాసురిడి’ పాత్ర హైలెట్ అయ్యింది. సో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ సినిమాల్లో ‘విలన్’ పాత్ర భీకరంగా ఉంటుంది. అలా చూసుకుంటే విలన్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయమంటున్నారు. ఎన్టీఆరే హీరో , విలన్ అనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.