Jana Nayagan Movie Leak: ఆరోజుల్లో ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలకు ముందు లీక్ అయ్యినప్పుడు ఎంత మంది సినీ సెలబ్రిటీలు అండగా నిలిచారో తెలియదు కానీ , నిన్న ‘జన నాయగన్’ చిత్రం విడుదల అయ్యినప్పుడు మాత్రం టాలీవుడ్ , కోలీవుడ్ నుండి మీడియం రేంజ్ సినీ సెలబ్రిటీల నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు రెస్పాన్స్ ఇచ్చారు. మన టాలీవుడ్ నుండి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ వేసాడు. ఆ చిత్ర నిర్మాత లోహిత్ తో త్వరలోనే ఆయన ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు రేపు జరగాలి. కానీ ఈ ఘటన జరగడం తో దానిని వాయిదా వేశారు. మరో పక్క కోలీవుడ్ నుండి సూర్య కార్తీ , శివ కార్తికేయన్ వంటి బడా హీరోలు కూడా ‘జన నాయగన్’ లీక్ అవ్వడం పై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేశారు.
ఇలా టాలీవుడ్, కోలీవుడ్ మొత్తం ముక్త కంఠం తో జన నాయగన్ లీక్ పై విచారం వ్యక్తం చేస్తూ , మూవీ టీం కి సపోర్టుగా నిలబడుతుంటే , విజయ్ నుండి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. నేడు ఎన్నికల ప్రచారం ముగించుకొని , తిరిగి వెళ్తున్న సమయంలో విజయ్ ని మీడియా రిపోర్టర్స్ ‘జన నాయగన్’ లీక్ అయ్యింది , దీని పై మీ రెస్పాన్స్ ఏమిటి? అని అడగ్గా, విజయ్ సమాధానం చెప్పకుండా నడుచుకుని వెళ్ళిపోతాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. విజయ్ దురాభిమానులు ఈ వీడియో ని షేర్ చేస్తూ, ఈయన సినిమా లీక్ అయితే, ఈయనే రెస్పాన్స్ ఇవ్వడు , కానీ ఈ హీరో అభిమానులు మాత్రం ఇతర హీరోలు రెస్పాన్స్ ఇవ్వాలని ఆశిస్తారు, ఇదెక్కడి విచిత్రం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోపక్క ఈ చిత్రానికి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయలేదు. ఎలా అయినా ఈ వారం లోపు ఈ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసి, ఈ నెల 30 న విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతలోపే ఈ అనర్థం జరిగింది. దీనిని నిర్మాత ఎలా డీల్ చేస్తాడో , చివరికి ఎలా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాడో అని విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీక్ అయిపోయిన సినిమా కాబట్టి, విడుదల తేదీని త్వరలోఈ ప్రకటిస్తారని, ఎక్కువ కాలం విజయ్ అభిమానులు థియేట్రికల్ రన్ కోసం ఎదురు చూసే అవసరం లేదని అంటున్నారు.