Site icon OkTelugu

Mad For Each Other Show Latest Episode Controversy: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ లో జంటల మధ్య తారా స్థాయికి చేరిన గొడవలు.. నోరు జారిన నటరాజ్ మాస్టర్..

Mad For Each Other Show Latest Episode Controversy

Mad For Each Other Show Latest Episode Controversy

Mad For Each Other Show Latest Episode Controversy: రోజురోజుకు ఆసక్తికరంగా మారుతూ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. హరిత – హరీష్ జంట ఎలిమినేట్ అయ్యాక , ఇక కంటెంట్ రాదు, షోలో దమ్ము ఉండదేమో , గొడవలు జరగవు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు హరిత – హరీష్ స్థానం లో నటరాజ్ మాస్టర్ నిలిచాడు. గత రెండు వారాల నుండి ఆయన సరిగా గేమ్స్ ని ఆడలేకపోతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నిన్న ఆయన స్టార్ మా యాజమాన్యం పై, ఈ షో కి జడ్జీ గా వ్యవహరిస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా బలానికి తగ్గ ఆటలు ఇవ్వడం లేదు, నాకు సంబంధం లేని ఆటలు ఇస్తున్నారు , కావాలని నన్ను అవమాన పరిచి టీఆర్ఫీ రేటింగ్స్ ని పొందాలని చూస్తున్నారు అంటూ నిన్న నోరు జారాడు నటరాజ్ మాస్టర్.

అంతే కాకుండా పిచ్చి పట్టిన వాడి లాగా , ఆవేశం తో గొడ్డలి తీసుకొని చిక్కని బలంగా నాన్ స్టాప్ గా కొట్టడాన్ని చూసిన తోటి సభ్యులు భయపడిపోయారు. శివ్ – ప్రియాంక సీరియల్స్ కి చెందివారు కాబట్టి, వాళ్ళు ఏమి చేసినా పైకి లేపుతున్నారని, మమ్మల్ని తొక్కేస్తున్నారని నటరాజ్ మాస్టర్ చాలా సీరియస్ ఆరోపణలే చేశాడు . దీని పై జడ్జీ గా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి చాలా తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘అంత కోపంగా మీరు ఎవరిని ఊహించుకొని కొట్టారు.. జడ్జీమెంట్ ఇస్తున్న మా ముగ్గురి మీద కోపంతో కొట్టారా ?, ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ షో ని డిజైన్ చేసిన టీం ని ఊహించుకొని కొట్టారా?, మీకు అన్యాయం జరుగుతుంది అనే కసితో కొట్టారా? ‘ అని అడుగుతాడు.

ఇది కాసేపు పక్కన పెడితే రాధ జాను – భాను లను ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరిద్దరూ నిజంగానే సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా సహాయం చేసుకున్నారా?, మీలో ఎంతమందికి అలా చేశారని అనిపించింది?’ అని అడుగుతుంది. దానికి భాను సమాధానం ఇస్తూ ‘నటరాజ్ మాస్టర్ బుద్ధి అలాంటిదే. ఆయన అదే దృష్టితో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తారు కాబట్టి , ఆయనకు అలాగే అనిపిస్తుంది’ అని అంటాడు. అందుకు నటరాజ్ మాస్టర్ ‘తప్పుగా మాట్లాడకు.. అందరి గురించి జడ్జీమెంట్లు పాస్ చేసేది మీరు’ అంటూ మండిపడుతాడు. అప్పుడు భాను ‘ఇలాంటి డైలాగ్స్ కొట్టడం ఆపి , ముందు గేమ్ ని ఆడడం నేర్చుకోండి’ అని అంటాడు. అప్పుడు నటరాజ్ మాస్టర్ ‘నేను గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు అసలు ఎందుకు పనికిరావు రా బచ్చా ‘ అని కామెంట్ చేస్తాడు. అలా వీళ్లిద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంటుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

 

 

Exit mobile version