Site icon OkTelugu

LIK Movie: ‘LIK ‘ చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో అతనేనా.. చేసుంటే పెద్ద ఫ్లాప్ అయ్యేది..

LIK Movie Day 2 Collections

LIK Movie Day 2 Collections

LIK Movie: ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించిన ‘LIK ‘ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ‘లవ్ టుడే’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ ఒప్పుకున్న చితమిది. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన సినిమా , కానీ గ్రాఫిక్స్ వర్క్ చాలా పెండింగ్ ఉండడం తో వాయిదాల మీద వాయిదాలు పడుతూ , ఎట్టకేలకు నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందని అంటున్నారు , మరికొంతమంది పర్వాలేదు , ఎదో కాస్త కొత్తగా ప్రయత్నం చేసారని అంటున్నారు. కానీ ఒక్కరు కూడా చెత్తగా ఉందని కానీ , అట్టర్ ఫ్లాప్ అని కానీ అనలేదు. కాబట్టి ఈ సినిమా కూడా ప్రదీప్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి డైరెక్టర్ విగ్నేష్ శివన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈయన ప్రముఖ హీరోయిన్ నయనతార భర్త. నయనతార నే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా మన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో చెయ్యాలని ప్లాన్ చేసాడట డైరెక్టర్ విగ్నేష్ శివన్. స్టోరీ కూడా ఆయనకు వినిపించాడట.. ఆయనకు చాలా బాగా నచ్చింది కానీ, ప్రస్తుతం తనకు ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాతే డేట్స్ ఇవ్వగలను అని చెప్పాడట. దీంతో అదే సమయం లో ప్రదీప్ ‘లవ్ టుడే’ తో భారీ సూపర్ హిట్ ని అందుకొని యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకోవడం , ఈ కథ కి ఇతను మాత్రమే న్యాయం చెయ్యగలడు అని నమ్మి ఈ కథని ప్రదీప్ కి వినిపించాడట. ఆయనకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.

అలా ఈ సినిమా విజయ్ దేవరకొండ నుండి ప్రదీప్ రంగనాథన్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే ఈ సినిమా ప్రదీప్ చేయడమే మేలు అయ్యిందని , ఒకవేళ విజయ్ దేవరకొండ చేసుంటే పెద్ద ఫ్లాప్ అయ్యేదని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. అలాంటి ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్న విజయ్ , ఈ సినిమాని చేస్తే ఆడియన్స్ లో అంత నమ్మకం రాదు, కచ్చితంగా దారుణమైన ఫలితాన్ని చూసేదాన్ని అంటున్నారు. ఇకపోతే ‘LIK ‘ చిత్రానికి ఓపెనింగ్స్ అయితే చాలా డీసెంట్ గానే వచ్చాయి. లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి.

Exit mobile version