Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదలైంది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని రీమేక్ చేసి నాశనం చేసారని , ఒక స్టార్ హీరో సినిమా ఎలా ఉండకూడదో ఉదాహరణ చెప్పడానికే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. కానీ విజయ్ ఫ్యాన్స్ కి ఇదే తమ అభిమాన హీరో నుండి చివరి చిత్రం కావడంతో , వాళ్ళు మాత్రం థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వసూళ్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు.
తమిళనాడు లో కూడా అతి కష్టం మీద టాప్ 10 లో ఓపెనింగ్ ని సంపాదించుకుంది. గత ఏడాది విడుదలైన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘విడాముయార్చి ‘ సినిమాల ఓపెనింగ్ వసూళ్లను కూడా ఈ చిత్రం తమిళనాడు లో అందుకోలేకపోయింది. ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ నుండి వచ్చిన మొదటి సినిమా, ఆయన సినీ కెరీర్ కి చివరి సినిమా అనే ట్యాగ్ లేకపోతే ఈ మాత్రం ఓపెనింగ్స్ కూడా వచ్చేవి కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక రాష్ట్రాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు నుండి 24 కోట్ల 50 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టగా, కర్ణాటక నుండి 11 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కఠోర నిజం ఏమిటంటే , తమిళనాడు తో పోలిస్తే , కర్ణాటక లోనే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
అదే విధంగా కేరళ నుండి 5 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 49 కోట్ల 35 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి 30 కోట్ల 65 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, ఓవరాల్ గా ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. విడుదలకు ముందు మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ ని ఈ చిత్రం అవలీలగా అందుకుంటుందని అంతా అనుకున్నారు , కానీ ఆ అంచనాలు పూర్తిగా తప్పాయి.








