‘Unstoppable with NBK’ stopped : ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో శాశ్వతంగా ఆగిపోయినట్టేనా..?

‘Unstoppable with NBK’ stopped : ఈ మధ్య కాలం లో ఓటీటీలలో వచ్చే టాక్ షోస్ లో ప్రభంజనం సృష్టించిన షో ఏదైనా ఉందా అంటే అది ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అని చెప్పొచ్చు.నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా, ఆహా మీడియా లో ప్రసారమైన ఈ టాక్ షోకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇటీవలే రెండవ సీజన్ ని కూడా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇక మీదట ఉండబోదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో […]

Written By: NARESH, Updated On : February 17, 2023 8:44 pm
Follow us on

‘Unstoppable with NBK’ stopped : ఈ మధ్య కాలం లో ఓటీటీలలో వచ్చే టాక్ షోస్ లో ప్రభంజనం సృష్టించిన షో ఏదైనా ఉందా అంటే అది ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అని చెప్పొచ్చు.నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా, ఆహా మీడియా లో ప్రసారమైన ఈ టాక్ షోకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇటీవలే రెండవ సీజన్ ని కూడా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇక మీదట ఉండబోదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

సీజన్ 1 గ్రాండ్ ఫినాలే లో బాలయ్య బాబు కొనసాగింపు ఉంటుంది, త్వరలోనే సీజన్ 2 తో మీ ముందుకు వస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.కానీ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లో మాత్రం ఇక సెలవు అనే అర్థం వచ్చేట్టు ‘ఈ జ్ఞాపకాలు చిరకాలం నా మదిలో ఉంటుంది’ అని అంటాడు బాలయ్య బాబు,అంటే దానికి అర్థం సీజన్ 3 లేదనీ అంటున్నారు విశ్లేషకులు.

బాలయ్య బాబు ఈ టాక్ షో ద్వారా నేటి తరం స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ తో చిట్ చాట్ చేసాడు.పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు,అల్లు అర్జున్ మరియు ప్రభాస్ వంటి వాళ్ళు కూడా ఈ షో కి వచ్చారు.ఇంకా నేటి తరం స్టార్ హీరోలలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మాత్రమే రావాల్సి ఉంది.ఇక బాలయ్య తరం హీరోలైన చిరంజీవి , వెంకటేష్ మరియు నాగార్జున వంటి వాళ్ళు కూడా బ్యాలెన్స్ ఉన్నారు.

వీళ్లందరితో సీజన్ 3 ప్లాన్ చెయ్యొచ్చు.కానీ వీళ్ళ కోసం సీజన్ 2 లోనే పార్టిసిపేట్ చేయించేందుకు సంప్రదింపులు జరపగా వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది.మళ్ళీ వాళ్ళని నమ్ముకొని సీజన్ 3 ప్లాన్ చేయలేమని ఆహా మీడియా ఒక అభిప్రాయం కి వచ్చిందట.అందుకే సీజన్ 3 ఇక ఉండబోదని సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.